బాలీవుడ్‌లోకి వెళ్లి ఎవరైనా సౌత్ డైరెక్టర్లు, నిర్మాతలు, ఆర్టిస్టులు సినిమాలు చేస్తే చాలా వరకు వినమ్రంగానే ఉంటారు. అక్కడి పద్ధతులకు తగ్గట్లు నడుచుకుంటూ సైలెంటుగా సినిమాలు చేసి వచ్చేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మను మినహాయిస్తే అక్కడ అగ్రెసివ్‌గా ఉన్న సౌత్ ఇండియన్ ఫిలిం సెలబ్రెటీలు కనిపించరు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం వర్మను మించి అగ్రెషన్ చూపిస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తోనే తనేంటో రుజువు చేసిన సందీప్.. లేటెస్ట్‌గా ‘యానిమల్’ను పెను సంచలనమే రేపాడు. ఈ చిత్రం ఏకంగా రూ.900 కోట్ల వసూళ్లు సాధించింది. నటుడిగా, ఒక స్టార్‌గా రణబీర్ కపూర్‌ను ఎలా వాడుకోవాలో చూపిస్తూ అతడికి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే సక్సెస్ ఇచ్చాడు సందీప్.
ఐతే ఈ సినిమాలో అనేక అంశాల మీద తీవ్ర వివాదాలు నడిచాయి. బాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలే చాలామంది ఈ సినిమా మీద విమర్శలు గుప్పించారు. జావెద్ అక్తర్ లాంటి లెజెండ్‌తో పాటు కిరణ్ రావు, కంగనా రనౌత్.. ఇలా చాలామంది సినిమాలోని విషయాలను తప్పుబట్టారు.
పురుషాధిక్యతను గ్లోరిఫై చేశారని.. మహిళల పాత్రలను కించపరిచేలా ప్రెజెంట్ చేశారని కంగనా లాంటి వాళ్లు సినిమాను విమర్శించారు. ఐతే వీళ్లందరికీ సందీప్ రెడ్డి దీటుగానే బదులిచ్చాడు. నీ కొడుకు ఫర్హాన్ అక్తర్ తీసిన మీర్జాపూర్ సిరీస్‌లో సన్నివేశాల పరిస్థితి ఏంటి అంటూ జావెద్ అక్తర్‌కు ఇచ్చిన సమాధానం అయితే ఆయనకు దిమ్మదిరిగిపోయేలా చేసి ఉంటుంది. కంగనా రనౌత్ విషయంలో మాత్రం సందీప్ కొంచెం సున్నితంగానే స్పందించాడు. ఆమె తన సినిమాను విమర్శించినప్పటికీ.. తనకు తగ్గ పాత్ర ఉంటే ఆమెకు ఆఫర్ చేస్తానని అన్నాడు.
దీనికి కంగనా బదులిస్తూ.. సందీప్ సినిమాలో ఛాన్సిచ్చినా తాను నటించనని తేల్చి చెప్పేసింది. ‘‘సినిమాను విమర్శించడానికి, సమీక్షించడానికి తేడా ఉంది. యానిమల్ సినిమాపై నా రివ్యూను మీరు నవ్వుతూ చెప్పారు. అది మీకు నాపై ఉన్న గౌరవం అయి ఉండొచ్చు. కానీ మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రా ఇవ్వకండి. అలా ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్టులు అవుతారు. అది మీకే ప్రమాదకరం. ఫిలిం ఇండస్ట్రీకి మీరు కావాలి’’ అంటూ వ్యంగ్యంగా స్పందించింది కంగనా.
This post was last modified on February 6, 2024 2:54 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…