కెజిఎఫ్ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని టాక్సిక్ కు ఓకే చెప్పిన యష్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. గోవా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్స్ మాఫియా మీద చాలా ఇంటెన్స్ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని బెంగళూరు వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం యష్ నిజంగానే గన్ షూటింగ్ నేర్చుకున్నాడు. శరీరానికి కఠిన వ్యాయామం అందించి మేకోవర్ చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 10 విడుదల కానుంది.
ఇందులో ఒక ప్రధానమైన క్యామియో కోసం గీతూ మోహన్ దాస్ ఏకంగా షారుఖ్ ఖాన్ ని సంప్రదించినట్టు లేటెస్ట్ అప్డేట్. చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎలివేట్ కావాలంటే సూపర్ స్టార్ రేంజ్ హీరో అవసరమని, ఆ కారణంగానే బాద్షాని అడిగినట్టు ముంబై టాక్. అయితే షారుఖ్ అంత సుముఖత చూపించకపోవచ్చు. ఎందుకంటే కొన్నేళ్లుగా తను గెస్టు రోల్స్ కి దూరంగా ఉంటున్నాడు. పఠాన్ లో చేసిన కారణంగానే సల్మాన్ ఖాన్ కోసం తిరిగి టైగర్ 3లో బదులు తీర్చాడు కానీ లేదంటే ఖచ్చితంగా ఒప్పుకునే వాడు కాదు.
పైగా వరస హిట్లతో మంచి ఊపుమీదున్న టైంలో క్యామియోలు అనుమానమే. అయితే గీతూ మోహన్ దాస్ అడిగింది కాబట్టి ఆమె ట్రాక్ రికార్డు చూసి అయినా ఆలోచించడం జరగొచ్చు. టాక్సిక్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కెజిఎఫ్ తర్వాత ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో యష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. విలన్ పాత్రధారి కూడా ఇంకా ఫైనల్ కాలేదు. సంజయ్ దత్ కాంబో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో పవర్ ఫుల్ స్టార్ ని వెతుక్కోవాలి. సరిగ్గా ఇంకో ఏడాది మాత్రమే టైం ఉంది కనక ప్రొడక్షన్ పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు
This post was last modified on February 5, 2024 8:54 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…