తమిళనాట ఇప్పుడు సినిమాల పరంగానే కాక రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతున్న పేరు.. విజయ్‌దే. గత దశాబ్ద కాలంలో తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎంతగానో పెంచుకుాడుని సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టి తమిళనాట నంబర్ వన్ స్టార్‌గా అవతరించాడు విజయ్. డీసెంట్ బిహేవియర్‌కు తోడు తక్కువ మాట్లాడడం, మాట్లాడినపుడల్లా మంచి మాటలు మాట్లాడడం, సినిమాల్లో మంచి సందేశాలు ఇవ్వడం ద్వారా అతను వ్యక్తిగతంగా కూడా జనాల్లో ఆదరణ పెంచుకున్నాడు.
జయలలిత మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి విజయ్ పార్టీ పెడతాడన్న అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ఇటీవలే ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని అనౌన్స్ చేశాడు విజయ్. దీంతో విజయ్ సినీ ప్రయాణానికి త్వరలోనే తెరపడబోతోంది.
ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమా చేస్తున్నాడు విజయ్. ఇది అతడి 68వ సినిమా. దీని తర్వాత మరో చిత్రం చేసి సినిమాల నుంచి తప్పుకుంటానని.. తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితం అవుతానని విజయ్ ప్రకటించాడు. చివరి సినిమా కచ్చితంగా రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుందని అందరికీ తెలుసు. మరి విజయ్ పొలిటికల్ ఐడియాలజీకి అద్దం పట్టే ఆ పవర్ ఫుల్ పొలిటికల్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముందు కార్తీక్ సుబ్బరాజ్ పేరు వినిపించింది కానీ.. తర్వాత విజయ్ ఆలోచన మారిందట.
లేటెస్ట్ సమాచారం ప్రకారం అజిత్‌తో వలిమై, తునివు సినిమాలు తీసిన హెచ్.వినోద్‌ను తన చివరి చిత్రానికి విజయ్ దర్శకుడిగా ఎంచుకున్నాడట. తొలి చిత్రం ‘శతురంగ వేట్టై’తోనే బలమైన ముద్ర వేశాడు వినోద్. తన రాజకీయ సలహాదారులను కూడా వినోద్ టీంలో చేర్చి మంచి పొలిటికల్ డ్రామాను తయారు చేయించే పనిలో విజయ్ ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.
This post was last modified on February 5, 2024 4:40 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…