సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఓ సినిమా రిలీజవుతోందంటే.. ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ఉండే హడావుడే వేరు. కొన్ని రోజుల పాటు సౌత్ ఇండియా అంతటా సినిమా వాళ్ల చర్చలన్నీ దాని చుట్టూనే తిరుగుతాయి. రజినీ ప్రత్యేక పాత్ర పోషించినా సరే.. ఆ హంగామా వేరుగా ఉంటుంది. కానీ ‘లాల్ సలాం’ అనే సినిమా విషయంలో జరుగుతున్నది చూస్తే షాకవ్వాల్సిందే.
‘జైలర్’ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాక రజినీ నుంచి వస్తున్న సినిమాకు కనీస స్థాయిలో కూడా హైప్ లేదు. అందులోనూ ఇది రజినీ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన సినిమా. కాబట్టి రజినీకి దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. కానీ ఈ చిత్రానికి తమిళనాట కూడా సరైన పబ్లిసిటీ చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. సినిమా నుంచి ఇప్పటిదాకా ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదీ బయటికి రాలేదు. ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించే ప్రయత్నాలే జరగడం లేదు.
తమిళంలోనే హైప్ తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా.. తెలుగులో ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నది సందేహమే. ఇప్పటిదాకా తెలుగు రిలీజ్ గురించి చిన్న ఊసు లేదు. ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలియదు. పోస్టర్లు కూడా వదలడం లేదు. ఈ రోజు సాయంత్రం ‘లాల్ సలాం’ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. అది ఎగ్జైటింగ్‌గా ఉండి, రజినీ పాత్ర విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగితే తప్ప.. ఈ శుక్రవారం ఓ మోస్తరుగా అయినా టికెట్లు తెగడం కష్టం.
చిత్ర బృందం ఉద్దేశపూర్వకంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోందా.. లేక సినిమా మీద నమ్మకం లేదా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఇందులో లీడ్ రోల్స్ చేసింది విష్ణు విశాల్, విక్రాంత్ అయినా.. జనం రజినీ సినిమాగానే చూస్తున్నారు. మరి రజినీ పాత్రకు సంబంధించిన మతలబు ఏంటో ట్రైలర్లో అయినా తెలుస్తుందేమో చూడాలి.
This post was last modified on February 5, 2024 2:00 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…