ఇంకో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగే సూచనలు స్పష్టంగా ఉండటంతో ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఇంకోవైపు వీటికి మద్దతుగా, వ్యతిరేకంగా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ కావడంతో ఈ చిత్రాల ప్రభావం జనాల మీద ఏ స్థాయిలో ఉంటుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ కోర్టు కేసులో నలుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మోక్షం దక్కితే కానీ సీక్వెల్ ‘శపథం’ బయటికి రాదు. ఏపీ అపోజిషన్ ని ఉద్దేశపూర్వకంగా విమర్శించడానికి తీశారనే అభియోగాన్ని వర్మ ఎదురుకుంటున్నారు.
ఇంకో మూడు రోజుల్లో ‘యాత్ర 2’ వచ్చేస్తుంది. సిఎం జగన్ మోహన్ రెడ్డికి మంచి ఎలివేషన్ ప్యాడ్ లా ఉపయోగపడుతుందని అభిమానులు భావిస్తున్నారు. థియేటర్ బిజినెస్, లాభాలు నష్టాల కన్నా జగన్ ఇమేజ్ ని పెంచడానికి పనికొస్తే చాలానే ఉద్దేశంతోనే ఇంత బడ్జెట్ పెట్టారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15 ‘రాజధాని ఫైల్స్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. అమరావతి రైతుల వ్యథలను ఆధారంగా చేసుకుని మూడు రాజధానుల అంశాన్ని స్పృశించిన విషయం ట్రైలర్ లో స్పష్టంగా అర్థమయ్యింది. పేర్లు నేరుగా చెప్పకపోయినా ఘాటు సెటైర్లు చాలానే ఉన్నాయి.
నారా రోహిత్ హీరోగా టీవీ5 మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రతినిధి 2’ సైతం పొలిటికల్ సిస్టమ్ ని ప్రశ్నించే ఉద్దేశంతో రూపొందుతున్నదే. వీటి ప్రభావం ఓటర్ల మీద ఇంత మోతాదులో ఉంటుందని కొలవలేం కానీ ఎలక్షన్ల టైంలో మాత్రం వీటి వీడియోలు, సీన్లను ప్రచారాలకు వాడుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఓపెనింగ్స్, కలెక్షన్ల కన్నా తమ ఎజెండాను పబ్లిక్ లోకి తీసుకెళ్లాలనే తాపత్రయమే ఈ దర్శక నిర్మాతల్లో కనిపిస్తోంది. ఏవి సక్సెస్ అవుతాయో ఏవి ఫెయిలవుతాయో చెప్పలేం కానీ మూవీ లవర్స్ మాత్రం తమకు పొలిటికల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తే చాలంటున్నారు.
This post was last modified on February 5, 2024 1:58 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…