స్టార్ క్యాస్టింగ్ లేకుండా చిన్న ఆర్టిస్టులతోనూ విజయాలు సాధించవచ్చని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైందిలో తీసుకుంది ఇలాంటి వాళ్లనే . బ్లాక్ బస్టర్ కాకపోయినా మంచి సక్సెస్ అందుకుని అయిదేళ్ల తర్వాత కూడా కల్ట్ ఫాలోయింగ్ కొనసాగించింది. గత ఏడాది బలగం, రైటర్ పద్మభూషణ్ ఇదే ఋజువు చేశాయి. ఈ సూత్రాన్ని నమ్ముకుని మొన్న శుక్రవారం విపరీతమైన పోటీ మధ్య కిస్మత్ విడుదలయ్యింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో పాటు మరో ఏడు సినిమాలు రేసులో ఉన్నా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించింది.
బ్యాడ్ లక్ ఏంటంటే కిస్మత్ కి టైటిల్ లో ఉన్న విధిరాత ఫలితంలో కలిసి రాలేదు. క్రైమ్ కామెడీతో నవ్వించి థ్రిల్ చేయాలని చూసిన దర్శకుడు శ్రీనాథ్ బాదినేని సరైన కథా కథనాలు రాసుకోలేకపోయాడు. హైదరాబాద్ కు ఉద్యోగం కోసం వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళ (నరేష్ అగస్త్య – అభినవ్ గోమటం – విశ్వదేవ్ రాచకొండ)కు అనుకోకుండా ఒక లోకల్ డాన్ (అజయ్ ఘోష్) పోగొట్టుకున్న కోట్ల రూపాయల డబ్బుతో లింక్ ఏర్పడుతుంది. దాని కోసం వెతుకుతున్న అతని ముఠాని తప్పించుకుని వీళ్ళు చేసే సాహసమే కిస్మత్. పాయింట్ పరంగా కూడా మరీ కొత్తదనం ఏమీ లేదు.
ఎంగేజింగ్ అనిపించే సన్నివేశాలు లేకపోవడంతో పాటు వేగంగా ఉండాల్సిన స్క్రీన్ ప్లే ఊగుతూ సాగడం కిస్మత్ ఫ్లోని దెబ్బ కొట్టింది. ఎక్కడా ఆసక్తి కలిగించే సీన్లు లేకపోవడంతో తీసుకున్న పాయింట్ మరీ రొటీన్ అయిపోయింది. ఇలాంటివి గతంలో బోలెడు చూడటంతో నటీనటులు తమ ప్రతిభ మేరకు ఎంత బాగా నటించినా అవన్నీ తేలిపోయాయి. కేవలం ఆర్టిస్టుల మొహాలు చూసి ఇలాంటి సినిమాల కోసం థియేటర్లకు రారు. అదిరిపోయే కంటెంట్ ఉందనో, లేదా థ్రిలయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయనో తెలిస్తే తప్ప జనాలను రప్పించడం కష్టం. ఈ విషయంలో కిస్మత్ కి ఏదీ కలిసి రాలేదు.
This post was last modified on February 5, 2024 12:01 pm
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…
పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…
‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి…