ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హైప్ ఉన్న వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈగల్. సంక్రాంతికే రావాల్సి ఉన్నా పోటీ తగ్గించడం కోసం వాయిదా వేసుకుని ఫిబ్రవరి 9 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. తాము ఎలాంటి ప్రయోగం చేయలేదని, పక్కా కమర్షియల్ మూవీగా అన్ని అంశాలు ఉంటాయని నిర్మాత టిజి విశ్వప్రసాద్ హామీ ఇచ్చారు. అంతే కాదు ఈసారి నిరాశపరచబోమని రవితేజకు స్టేజి మీదే హామీ ఇచ్చారు. ట్రైలర్ చూశాక జనాలకు ఎక్కువగా యాక్షన్ కంటెంట్ ఉన్న చిత్రంగా అభిప్రాయం కలిగిన మాట వాస్తవం.
ఊహించని విధంగా అసలు కథ వేరే ఉంటుందట. దాని ప్రకారం ఇందులో రవితేజ పోషించిన ఈగల్ పాత్ర పత్తి రైతుల సమస్యల మీద పోరాడే విధంగా డిజైన్ చేశారట. అలా అని ఏదో సందేశాలు, విప్లవాలు లాంటివి లేకుండా అంతర్లీనంగా మెసేజ్ ఇస్తూనే మాస్ జనాలు ఊగిపోయే ఎపిసోడ్స్ చాలానే పెట్టారని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని వాటిని తీర్చిదిద్దిన విధానం షాక్ ఇస్తుందట. ప్రమోషన్లలో వాటిని ముందే చూపిస్తే థ్రిల్ తగ్గిపోతుంది కాబట్టి కావాలనే దాచి పెట్టినట్టు తెలిసింది. స్వయంగా రవితేజనే ఇందులో పత్తి పండించే వ్యవసాయదారుడిగా కనిపిస్తాడు.
చూస్తుంటే మాస్ మహారాజా ఈసారి సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నాడు. ధమాకా తర్వాత తనకు సోలో హిట్ పడలేదు. వాల్తేరు వీరయ్యలో పరిమిత పాత్ర కాబట్టి దాని క్రెడిట్ పూర్తిగా దక్కలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. ఈ ప్రభావం ఈగల్ బజ్ మీద పడటం వల్లే సోషల్ మీడియాలో ఇంకా ఫోకస్ దక్కలేదు. స్టార్ హీరోలు డ్రైగా భావించే ఫిబ్రవరి నెలను రిలీజ్ కు ఎంచుకున్న రవితేజకు మంచి ఫలితం దక్కాలంటే బ్లాక్ బస్టర్ టాక్ తప్పనిసరి. లేదంటే పరీక్షల మూడ్ లో ఉన్న పిల్లలు, యువతను థియేటర్లకు వచ్చేలా చేయడం కష్టం. చూడాలి మరి.
This post was last modified on February 5, 2024 12:02 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…