గత కొన్నేళ్లలో సినిమాల పరంగా భాషలు, ప్రాంతాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఓటీటీలు, పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని అన్ని భాషల వాళ్లూ అన్ని ఇండస్ట్రీల సినిమాలూ చూసేస్తున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వేర్వేరు ఇండస్ట్రీలకు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. నిర్మాతలు కూడా తమ పరిధిని విస్తరిస్తున్నారు.
ఓవైపు సొంత ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు గత ఏడాది కోలీవుడ్‌కు వెళ్లి ‘వారిసు’ సినిమాను అందించారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ మలయాళంలో టొవినో థామస్ హీరోగా ఓ సినిమా తీస్తోంది. టాలీవుడ్లో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్యే కోలీవుడ్లో అడుగు పెట్టింది.
తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా.. తమిళంలోకి ఓ చిన్న సినిమాతో అడుగు పెట్టింది. ఆ సినిమానే.. వడక్కుపట్టి రామసామి. కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. కార్తీక్ యోగి దర్శకుడు. ఈ వీకెండ్లోనే ఈ సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు కానీ.. కామెడీ ప్రియులను సినిమా బాగా ఆకట్టుకోవడంతో వసూళ్లు క్రమంగా పెరిగాయి. ఆదివారానికి సినిమా సూపర్ హిట్ రేంజికి వెళ్లిపోయింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. పెద్ద సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. సంతానంకు కూడా చాన్నాళ్ల తర్వాత హీరోగా మంచి విజయం దక్కినట్లే కనిపిస్తోంది. తమిళంలో పీపుల్స్ మీడియా సంస్థకు తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ పడింది.
This post was last modified on February 4, 2024 3:29 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…