తన కెరియర్‍ని ‘వి’ మలుపు తిప్పుతుందని సుధీర్ బాబు చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాని లాంటి పాపులర్ నటుడి సినిమాలో హీరో పాత్ర పోషించడం, తనకూ పాటలూ, ఫైట్లూ వుండడంతో పాపం సుధీర్ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుందన్నా కానీ నిరాశ పడిపోకుండా గట్టిగా ప్రమోషన్స్ చేసాడు. ఈ చిత్రం గురించి, తన నటన గురించి తన బావ మహేష్ నుంచి ట్వీట్ పడుతుందని సుధీర్ ఆశించి వుంటాడు. అయితే ఈ సినిమా చూసేసి కిమ్మనకుండా వున్న మిగతా అందరు సెలబ్రిటీస్‍లానే మహేష్ కూడా మౌనం పాటిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని మన హీరోలు, దర్శకులు చూడలేదు అనుకోవడానికి లేదు. అందరూ హోమ్ థియేటర్స్ లో ఫ్యామిలీస్‍తోనే చూసేసారు. అయితే ‘వి’ చిత్రానికి వచ్చిన యునానిమస్ బ్యాడ్ టాక్ వల్ల ఇక సెలబ్రిటీలు మొహమాటం ట్వీట్స్ కి దూరంగా వుంటున్నారు. దిల్ రాజు, నాని కూడా ఈ చిత్రం ఫలితాన్ని ముందే ఊహించడం వల్లే ఓటిటి రిలీజ్‍కి ఓకే చెప్పేసారనే కామెంట్స్ వినిపిస్తున్నా కానీ వాళ్లు వాటిపై స్పందించడం లేదు. ఇక సుధీర్ విషయానికి వస్తే నటుడిగా ఎంత కష్టపడుతున్నా కానీ హీరోగా తనకు బూస్ట్ ఇచ్చే సినిమా మాత్రం పడడం లేదు.
This post was last modified on September 7, 2020 8:46 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…