అనుకున్నట్టే దేవర వాయిదా ఫ్యామిలీ స్టార్ కు వరంగా మారింది. పోస్ట్ పోన్ గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ అంతర్గతంగా ఆల్రెడీ తీసేసుకున్న నిర్ణయం కావడంతో నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 5ని ది ఫ్యామిలీ స్టార్ కోసం లాక్ చేసుకున్నారు. మళ్ళీ వేరొకరు థియేటర్ల సమస్యకు తనను బాధ్యుణ్ణి చేయకుండా చేసిన ఆలోచన బాగుంది. సరిగ్గా ముందు వారంని టిల్లు స్క్వేర్ కి నాగవంశీ తీసుకున్న నేపథ్యంలో జస్ట్ వన్ వీక్ గ్యాప్ లో ఎస్విసి నెక్స్ట్ డేట్ మీద కర్చీఫ్ వేసేయడంతో ట్రేడ్ వర్గాలకు రిలీజుల పట్ల క్లారిటీ వచ్చేసింది.
ఇక్కడ చూస్తే దేవర బలహీనతే దేవరకొండకు బలంగా మారింది. పక్కా ప్లానింగ్ తో, జూనియర్ ఎన్టీఆర్ పూర్తి సహకారంతో దర్శకుడు కొరటాల శివ ఎప్పటికప్పుడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంటూ వచ్చినా రెండు ప్రధాన కారణాలు అడ్డంకిగా నిలిచాయి. మొదటిది అనిరుద్ రవిచందర్ సంగీతం. హడావిడి పెడితే ఏదేదో ఇచ్చే రకం కాబట్టి తగినంత టైం ఇస్తే తప్ప ఇతని నుంచి బెస్ట్ రాబట్టుకోలేం. అందుకే ఓపిగ్గా ఎదురు చూడటం మినహా తారక్, శివలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. పైగా పాటల చిత్రీకరణ బ్యాలన్స్ అనుకుంటే ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీ రీరికార్డింగ్ కి తగినంత టైం కావాలి.
మరో రీజన్ విజువల్ ఎఫెక్ట్స్. పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా చేస్తున్నా క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశమే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయించేలా చేస్తోంది. ఫారిన్ షెడ్యూల్ వల్ల సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఫ్యామిలీ స్టార్ కి ఏప్రిల్ 5 లాంటి బ్రహ్మాండమైన దొరికేసింది. పెద్దా వీకెండ్ తో పాటు ఉగాది పండగ వసూళ్ల మోత మోగించడం ఖాయం. అఫ్కోర్స్ పాజిటివ్ టాక్ వస్తేనే సుమా. అన్నట్టు టైటిల్ ముందు ‘ది’ జోడించడం ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. విజయ్ దేవరకొండ పేరుకి ముందు ది పెట్టడం పట్ల ఆ మధ్య చిన్నపాటి దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా టైటిల్ కే తగిలించారు.
This post was last modified on February 5, 2024 2:55 pm
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…