సంక్రాంతి తర్వాత పెద్ద సినిమా వచ్చి వారాలు దాటేసిన నేపథ్యంలో అందరి కళ్ళు ఈగల్ మీదకు వెళ్తున్నాయి. పోటీని తగ్గించాలనే ఉద్దేశంతో పండగ బరినుంచి తప్పుకోవడం వల్ల సోలో రిలీజ్ హామీ నెరవేరకపోయినా ఊరిపేరు భైరవకోన తప్పుకోవడం వల్ల అడ్వాంటేజ్ పెరగనుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో అభిమానుల ఆశలన్నీ ఈగల్ మీదే ఉన్నాయి. ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు. గతంలో షూట్ చేసి వాడని ఇంటర్వ్యూలు, ప్రోగ్రాంలు ఒక్కొక్కటిగా వదలుతూ ఆడియన్స్ లో ఆసక్తి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి
ఈ సౌండ్ సరిపోదు. ఎందుకంటే ఈగల్ మీద భారీ అంచనాలేం లేవు. ట్రైలర్ ని పూర్తి యాక్షన్ మోడ్ లో కట్ చేయడంతో ఇది ఫ్యామిలి మూవీ కాదేమోననే అభిప్రాయం కొన్ని వర్గాల్లో లేకపోలేదు. రవితేజతో సహా టీమ్ మొత్తం దీని గురించి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా బలంగా ఆ మెసేజ్ ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలి. పైగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి ప్రత్యేకంగా బ్రాండ్ అంటూ లేదు. సాంకేతికంగా ఎంత అనుభవమున్నా డైరెక్టర్ గా ఇంతకు ముందు తీసింది ఒకటే. నిఖిల్ సూర్య వర్సెస్ సూర్య. సో తన వైపు నుంచి బజ్ పెరగడమంటూ ఉండదు.
ఈగల్ లో భారీ క్యాస్టింగ్, బడ్జెట్ తో పాటు డిఫరెంట్ గా అనిపించే కాన్సెప్ట్ బోలెడుంది. దాన్ని సరైన పబ్లిసిటీతో ప్రొజెక్ట్ చేస్తే ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతుంది. తాజాగా విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి టాక్ డీసెంట్ గానే ఉంది మరీ అద్భుతాలు చేసే రేంజ్ లో ఉంటుందా అంటే రెండు రోజులు ఆగితే తెలుస్తుంది. మిగిలిన ఎనిమిది సినిమాల గురించి కనీస ఊసు లేదు. ఈగల్ తో నేరుగా తలపడుతున్న యాత్ర 2ది పొలిటికల్ ఎజెండా కాబట్టి టెన్షన్ లేదు. లాల్ సలామ్ మీద బజ్ సోసోనే. సో ఈగల్ కు గ్రౌండ్ ఫ్రీగా ఉంది. రవితేజ బౌండరీలు బాదాలంటే పాజిటివ్ టాక్ వస్తే చాలు.
This post was last modified on February 3, 2024 11:17 am
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…