పవన్‍ డబ్బింగ్‍కే రాలేదు… ఇక షూటింగ్‍ చేస్తాడా?

‘వకీల్‍సాబ్‍’ షూటింగ్‍ మరో నెల రోజుల పాటు చేస్తే పూర్తయిపోతుంది. అంటే ఇప్పటికే చాలా భాగం చిత్రీకరించేసారన్నమాట. మరి అంత కంటెంట్‍ చేతిలో పెట్టుకుని పవన్‍ పుట్టినరోజుకి మోషన్‍ పోస్టర్‍ ఎందుకు రిలీజ్‍ చేసినట్టు? నిజానికి ఈ చిత్రానికి టీజర్‍ కూడా కట్‍ చేసి రెడీగా పెట్టుకున్నారట. అయితే టీజర్‍కి పవన్‍కళ్యాణ్‍ డబ్బింగ్‍ చెప్పాలి. అందుకోసం పవన్‍ని సంప్రదిస్తే ఈ టైమ్‍లో టీజర్‍ విడుదల చేయడం అవసరమా అని అడిగాడట.

పవన్‍ కాదన్నాక ఇక ఎవరు మాత్రం చేసేదేమి వుంటుంది. అందుకే టీజర్‍ కట్‍ రెడీగా వున్నా కానీ పోస్టర్‍తో సరిపెట్టేసారన్నమాట. కరోనా ఇంకా ఇంకా ప్రబలిపోతుండగా షూటింగ్‍ చేయడానికి పవన్‍ అసలు అంగీకరించడం లేదు. తన సినిమా షూటింగ్‍ కోసం అంత మంది ఆరోగ్యాన్ని, ప్రాణాలను బలి పెట్టలేనని, అంతా సద్దుమణిగాకే షూటింగ్‍ చేసుకుందామని అంటున్నాడట. మరోవైపు చాలా మంది దర్శకులు తక్కువ మంది బృందంతో షూటింగ్స్ మొదలు పెట్టేసారు. పెద్ద సినిమాలను కూడా అక్టోబర్‍ నుంచి నెమ్మదిగా మొదలు పెట్టాలనే చూస్తున్నారు. కానీ వకీల్‍ సాబ్‍ మాత్రం షూటింగ్‍కి వచ్చే మూడ్‍లో అస్సలు లేడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తదుపరి చేయాల్సిన చిత్రాల గురించి మాత్రం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.