సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు సెలబ్రెటీలను ఉద్దేశించి ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. బూతులు తిడుతుంటారు. ఏకవచనంతో సంబోధిస్తుంటారు. చాలా క్యాజువల్‌గా కామెంట్లు పెట్టేస్తుంటారు. వీటిని చాలావరకు సెలబ్రెటీలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కొందరేమో రాంగ్ కామెంట్లకు దీటుగా బదులిస్తుంటారు. కొందరు మాత్రం కామెంట్లను స్పోర్టివ్‌గా తీసుకుంటూ ఉంటారు.
చాలా ఏళ్ల కిందట సిద్దార్థ్-షాలిని జంటగా ‘ఓయ్’ సినిమా తీసిన ఆనంద్ రంగా తన గురించి ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రెండేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘ఓయ్’ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. దానికి స్పందిస్తూ వేలంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న ‘ఓయ్’ను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఆనంద్ రంగా.
ఈ పోస్టు కింద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఒరేయ్ గుండు నాయాలా ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావ్ రా’’ అని కామెంట్ పెట్టారు. దానికి నవ్వుతున్న ఎమోజీని రిప్లైగా ఇచ్చాడు ఆనంద్. దానికి ఆ నెటిజన్.. ‘‘మిమ్మల్ని గుండు అన్నందుకు సారీ’’ అని బదులిచ్చాడు. మళ్లీ ఆనంద్ స్పందిస్తూ.. ‘‘పర్వాలేదు. అది నిజమే కదా’’ అని కామెంట్ పెట్టడం విశేషం. ఒక దర్శకుడు ఇంత స్పోర్టివ్‌గా స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఓయ్’ అనుకున్నంత బాగా ఆడకపోయినా.. దర్శకుడిగా ఆనంద్ రంగాకు మంచి పేరే తెచ్చింది. కానీ అతను తర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. ‘పొగ’ అని ఓ సినిమా.. ఇంకేదో మూవీ తీసినా ఫలితం లేకపోయింది. ఈ మధ్య అతను ఓటీటీ కంటెంట్ మీద దృష్టిపెట్టాడు.
This post was last modified on February 2, 2024 5:19 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…