ప్రముఖ మోడల్, సినీ నటి పూనమ్ పాండే హఠాన్మరణం పాలయ్యారు. కొంతకాలంగా గర్భాశయ(సర్వికల్) క్యాన్సర్ తో బాధపడుతున్న పూనమ్ పాండే ఈ రోజు ఉదయం ఉత్తర ప్రదేశ్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూనం పాండే పీఆర్ టీం ఒక ప్రకటనలో వెల్లడించింది. 32 ఏళ్ల పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్ తో పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని పూనం పాండే టీం ఆమె ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.
తామేంతో అభిమానించే పూనమ్ పాండే ఇక లేరని చెప్పేందుకు తాము ఎంతో బాధపడుతున్నామని ఆమె పీఆర్ టీం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తనను అభిమానించే ప్రతి వ్యక్తిని ప్రేమించే పూనమ్ పాండే ఇక లేరు అని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని అన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తాము గోప్యతను కోరుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
బాలీవుడ్, కన్నడ, తెలుగు, సినిమాలలో పూనమ్ పాండే నటించారు. కొన్ని టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు ఉంది. 2011లో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే తాను న్యూడ్ షో చేస్తానని పూనం పాండే చేసిన కామెంట్ తో ఆమె పేరు ఒక్కసారిగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. పూనమ్ పాండే మరణ వార్త తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.
This post was last modified on February 2, 2024 1:44 pm
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…