‘బిగ్ బాస్’ తెలుగు వెర్షన్ కొత్త సీజన్ మొదలై ఒక్క రోజే అయింది. ఆ ఒక్క రోజులో జరిగింది పార్టిసిపెంట్ల పరిచయమే. ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించి.. ఒక్కొక్క పార్టిసిపెంట్‌ను పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపడం మాత్రమే జరిగింది. లోపల వాళ్లకు ఇంకా పరిచయాలు కూడా జరిగినట్లు షోలో చూపించలేదు. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో ఒక పార్టిసిపెంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలైపోవడం.. ఆ వ్యక్తిని షో నుంచి బయటికి పంపించేయాలంటూ ఉద్యమం మొదలైపోవడం గమనార్హం. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా.. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి. గత ఏడాది టీవీ 9 నుంచి జాఫర్ ఈ షోలో పాల్గొన్నాడు. అతను ఏమంత ఆకట్టుకోలేదు. షోలో కొన్ని ఎసిసోడ్ల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఐతే సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే దేవి షోలో ఆరంభ వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతుందేమో అనిపిస్తోంది.
నిన్న రాత్రి న్యూస్ యాంకర్ దేవి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే.. #Eliminatedevinagavalli అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీని మీద వేలల్లో ట్వీట్లు పడిపోయాయి. దీని వెనుక ఉన్నది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తోందంటూ టీవీ9 మీద వాళ్లు విరుచుకుపడుతున్నారు కొంత కాలంగా. తాజాగా వ్యవహారం మరింత ముదిరింది. రెండు రోజులుగా ‘షేమ్ లెస్ టీవీ9’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటిదాకా 5 లక్షలకు పైగా ట్వీట్లు పడటం గమనార్హం. సరిగ్గా టీవీ9 మీద జనసైనికుల ఆగ్రహం పతాక స్థాయిలో ఉన్న సమయంలోనే ఆ టీవీ ఛానెల్‌కు చెందిన దేవి బిగ్ బాస్‌లోకి వచ్చింది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేయాలని.. అందుకోసం ఓటింగ్‌కు రెడీ అవ్వాలని జనసైనికుల్లోకి మెసేజ్ వెళ్లిపోయింది. దీంతో ఆమె ఎలిమినేషన్ కోసం ట్రెండ్ మొదలుపెట్టేశారు. ఎలిమినేషన్ ప్రాసెస్‌లోకి దేవి వస్తే మాత్రం ఆమె బయటికి వెళ్లిపోవడం గ్యారెంటీ ఏమో.
This post was last modified on September 7, 2020 7:54 pm
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…