ఏ చిన్న సినిమాకి అయినా ప్రేక్షకుల దృష్టిలో పడడం, వారి క్రేజ్ చూరగొనడం అన్నిటికంటే పెద్ద అఛీవ్మెంట్. చిన్న సినిమా కనుక ప్రేక్షకుల దృష్టిలో పడలేదంటే ఇక అది ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా గుర్తుంచుకోరు. అందుకే పబ్లిసిటీపై నిర్మాతలు చిన్న సినిమాలకి కూడా కోటి, రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రెండు చిన్న సినిమాలకి మాత్రం అదనపు శ్రమ లేకుండా క్రేజ్ వచ్చింది. ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రాలకు పాటల వల్ల కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ వచ్చింది. ఈ సినిమాలు అనుకున్న సమయంలో విడుదల అయి ఉంటే ఆ క్రేజ్ కి ఖచ్చితంగా మంచి వసూళ్లు తెచ్చుకుని ఉండేవి.
లాక్ డౌన్ వల్ల ఈ చిత్రాలు కొన్ని నెలల పాటు వాయిదా పడ్డాయి. అప్పుడెప్పుడో ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఉంటుందనేది డౌటే. ఉప్పెన నిర్మాతలు వందల కోట్ల విలువైన సినిమాలు తీస్తుంటారు కనుక వాళ్ళు ఈ భారం తట్టుకోగలరు.
కానీ 30 రోజుల్లోపై అయిదు కోట్ల వరకు ఖర్చు పెట్టేసిన నిర్మాతకి మాత్రం ఇది పెను భారమే. ఓటిటీ నుంచి కూడా ఈ చిన్న సినిమాకు అంత రాదు కనుక ఎన్ని రోజుల్లో విడుదలవుతుందో అని ఎదురు చూస్తూ వడ్డీలు కట్టుకోక తప్పదు.
This post was last modified on April 26, 2020 4:32 pm
మాళవిక మోహనన్.. రీసెంట్ గా విడుదలైన తంగలన్ చిత్రంలో యాక్షన్ పాకుడు నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ…
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతని తనకు కాకుండా వేరొకరికి ఇవ్వడం పట్ల దేవిశ్రీ ప్రసాద్…
దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’…
నితిన్-రష్మి-వెంకీ కుడుముల కలయికలో వచ్చిన ‘భీష్మ’ అప్పట్లో పెద్ద హిట్టే అయింది. మళ్లీ ఈ కలయికలో సినిమాను అనౌన్స్ చేసినపుడు…
తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ…
తమిళ కథానాయిక త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. వర్షం. ఆ సినిమాతో ఒకేసారి ఆమె చాలా మెట్లు…