శివ కార్తికేయన్ అనే తమిళ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ డాక్టర్, ప్రిన్స్, మహావీరుడు లాంటి సినిమాలతో అతను మన ప్రేక్షకులకు కూడా బాగానే చేరువ అయ్యాడు. తమిళంలో ఈ యువ కథానాయకుడి ఎదుగుదల సూపర్ సక్సెస్ స్టోరీ అనే చెప్పాలి. ముందుగా అతను వీడియో జాకీగా జనాలకు పరిచయం కావడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లో హీరో ఫ్రెండ్ తరహా సహాయ పాత్రలు చేశాడు.
కోలీవుడ్లో అతడికి లిఫ్ట్ ఇచ్చింది స్టార్ హీరో ధనుష్. అతను హీరోగా చేసిన ‘3’లో పెద్దగా డైలాగ్స్ లేని ఫ్రెండు పాత్రలో నటించాడు శివ. ఆ తర్వాత అతణ్ని హీరోగా పెట్టి ధనుషే ‘ఎదిరి నీచిల్’ అనే సినిమా తీశాడు. అది పెద్ద సక్సెస్ అయింది. శివకు హీరోగా గుర్తింపు తెచ్చింది. ఆపై వరుసగా హిట్లు కొట్టి చూస్తుండగానే స్టార్ అయిపోయాడు శివ.
శివకార్తికేయన్ నటించిన రజినీ మురుగన్ లాంటి సినిమాలు సాధించిన వసూళ్లు చూసి కొన్నేళ్ల కిందటే ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయాడు. పెద్ద స్టార్‌గా ఎదిగినప్పటికీ ఒదిగి ఉంటూ.. మనలో ఒకడు అనిపించే క్యారెక్టర్లు చేయడం ద్వారా శివ తన ఇమేజ్‌ను ఇంకా ఇంకా పెంచుకుంటున్నాడు. విశేషం ఏంటంటే.. ధనుష్ ద్వారా సాయం పొంది హీరోగా నిలదొక్కుకున్న శివకార్తికేయన్.. ఇప్పుడు అతణ్నే మించిపోయాడు.
సంక్రాంతికి ధనుష్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’కు పోటీగా శివ సినిమా ‘అయలాన్’ బరిలో నిలిచింది. ముందు ధనుష్ సినిమాకే హైప్ కనిపించింది. ఓపెనింగ్స్‌లోనూ అది డామినేట్ చేసింది. కానీ రెండో రోజు నుంచి కథ మారింది. అయలాన్ వసూళ్లు అంతకంతకూ పెరిగాయి. కెప్టెన్ మిల్లర్ డౌన్ అయిపోయింది. రిలీజైన మూడు వారాలకు కూడా అయలాన్ మంచి వసూళ్లు సాధిస్తోంది. 100 కోట్లకు పైగా వసూళ్లతో శివ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది అయలాన్. దాంతో పోలిస్తే కెప్టెన్ మిల్లర్ వసూళ్లు 60 శాతం కూడా లేవు. అయలాన్ గత వారం తెలుగులోనూ రిలీజ్ కావాల్సింది కానీ.. లీగల్ ఇష్యూస్ వల్ల తెలుగు రిలీజ్ ఆగిపోయింది.
This post was last modified on %s = human-readable time difference 10:39 pm
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…