ఆంధ్రప్రదేశ్ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడైన కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకుడిగా టాలీవుడ్లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. అతడి తొలి సినిమా సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్. రెండో చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం సూపర్ హిట్. మూడో చిత్రం నేల టికెట్టు తేడా కొట్టినా.. నాలుగో సినిమా బంగార్రాజు ఉన్నంతలో బాగానే ఆడింది. కానీ ట్రాక్ రికార్డు బాగున్నప్పటికీ.. తన ప్రతి సినిమా ముంగిట అనిశ్చితి, జాప్యం తప్పట్లేదు.
నేల టికెట్టు తర్వాత బంగర్రాజు పట్టాలెక్కడానికి చాలా టైం పట్టింది. ఆపై మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ఓకే అయి, ఇక షూటింగ్‌కు వెళ్లడమే తరువాయి అనుకున్నాక అది పక్కకు వెళ్లిపోయింది. ఈ సినిమా ఒక రీమేక్ అని ప్రచారంలో ఉండగా.. ‘భోళా శంకర్’ డిజాస్టర్ ఎఫెక్ట్ దాని మీద పడి క్యాన్సిల్ అయిపోయింది. దీని వల్ల కళ్యాణ్‌కు ఏడాదికి పైగా సమయం వృథా అయింది. మళ్లీ అతను కొత్త ప్రాజెక్టు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కళ్యాణ్‌తో అనుకున్న ప్రాజెక్టును పక్కన పెట్టి చిరు, సుస్మిత.. హరీష్ శంకర్ సినిమాను టేకప్ చేయడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయిన విషయం అధికారికం అయింది. ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడన్నది ప్రశ్న. తనకు గాడ్ ఫాదర్ లాంటి నాగార్జున దగ్గరికే అతను వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి ‘నా సామి రంగ’తో సక్సెస్ అందుకున్న నాగ్.. అదే తరహా రూరల్ డ్రామాతో వచ్చే సంక్రాంతి రేసులో నిలవాలనుకుంటున్నాడు. ఇందుకు ఆయనకు కనిపిస్తున్న ఆప్షన్.. బంగార్రాజు ఫ్రాంఛైజీనే. దాన్ని కళ్యాణ్ అయితేనే బాగా డీల్ చేయగలడన్న అంచనాలున్నాయి. కాకపోతే ‘బంగార్రాజు’ పూర్తి సంతృప్తినివ్వని నేపథ్యంలో నాగ్ కొత్త ఆప్షన్ ఏమైనా చూస్తాడేమో తెలియదు. ‘నా సామి రంగ’ దర్శకుడు విజయ్ బిన్నీకే ఇంకో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి కళ్యాణ్ కృష్ణ కెరీర్ అయితే ప్రస్తుతం అనిశ్చితిలోనే కనిపిస్తోంది. అతణ్ని నాగ్ అయినా ఆదుకుంటాడా.. లేక మరో ఆప్షన్ చూసుకోక తప్పదా అన్నది వేచి చూడాలి.
This post was last modified on February 3, 2024 1:55 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…