ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న ముచ్చటైనా సరే.. జాతీయ స్థాయిలో వార్తాంశంగా మారిపోతుంది. ‘బాహుబలి’ తర్వాత అతడి క్రేజ్ ఆ స్థాయికి చేరింది మరి. అతడి సినిమాల అప్ డేట్లను ఉత్తరాది ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ను డైరెక్ట్ చేస్తున్న రాధాకృష్ణ కుమార్.. ట్విట్టర్లో ప్రభాస్ అభిమానులను ఊరించే ట్వీట్ చేశాడు మొన్న.
కామెంట్ల రూపంలో ప్రభాస్ అభిమానులు తమ ప్రశ్నలను సంధించవచ్చని.. అందులో అత్యుత్తమమైన ఐదు ఎంచుకుని వాటికి ఆదివారం సమాధానం ఇస్తానని చెప్పాడు. అన్నట్లే ఆదివారం రాత్రి తనకు నచ్చిన ఐదు ప్రశ్నలు ఎంచుకుని వాటికి జవాబులిచ్చాడు. ఆ ప్రశ్నలేంటన్నది వెల్లడించలేదు కానీ.. అతనిచ్చిన ఐదు జవాబులేంటో చూద్దాం.
— అవును. మన డార్లింగ్‌ను డైరెక్ట్ చేయాలన్నది నా కల. సెట్లో అతడితో పని చేయడం అమితమైన సంతోషాన్నిచ్చింది.
— రాధేశ్యామ్ థియేటర్లలోనే, వచ్చే ఏడాది విడుదలవుతుంది.
— డార్లింగ్ లుక్స్ ‘రాధేశ్యామ్’కు అతి పెద్ద ఆకర్షణగా నిలుస్తాయి.
— ‘రాధేశ్యామ్’కు పూజా హెగ్డేనే ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్.
— మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు అన్నీ వస్తాయి. కొంచెం ఓపికతో ఉండండి. సరైన సమయంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాం.
వీటిలో అన్నిటికంటే అభిమానుల్ని మురిపించిన మాట.. ప్రభాస్ లుక్స్ సినిమాలో అదిరిపోతాయన్నదే. అలాగే మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు సరైన సమయంలో విడుదలవుతాయని చెప్పడం ద్వారా.. వచ్చే నెల 23న ప్రభాస్ పుట్టిన రోజుకు ఏదో ఒక కానుక ఉంటుందని చెప్పకనే చెప్పాడు రాధాకృష్ణ. మిగతా ముచ్చట్లన్నీ మామూలువే.
This post was last modified on September 7, 2020 1:56 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…