కెరీర్ మెల్లగా ఎదుగుతున్న దశలో యూత్ హీరోలు సాధారణంగా రిస్క్ లేని గేమ్ ఆడేందుకు చూస్తారు. ప్రేమకథలు చేసినా తమ ఇమేజ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అతి జాగ్రత్త పడే వాళ్ళు లేకపోలేదు. కానీ సుహాస్ దానికి భిన్నంగా వెళ్లడమే అతని సినిమాలకు ప్రత్యేకత తెచ్చి పెడుతోంది. ఎల్లుండి విడుదల కాబోతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి అతనే బ్రాండ్ అంబాసిడర్. బిజినెస్ ఎంత జరిగినా, రేపు రాత్రి ప్రీమియర్లకు జనాలు ఎందరొచ్చినా మొదటి క్రెడిట్ తనకే చెందుతుంది. సరే ఇందులో విశేషం ఏముందనేగా మీ డౌట్. అసలు పాయింట్ కి వద్దాం.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సుహాస్ సెలూన్ షాప్ నడిపే కుర్రాడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు చేయించుకుని నటించాడు. సెకండ్ హాఫ్ మొత్తం పొట్టి హెయిర్ స్టైల్ తోనే ఉంటాడని యూనిట్ టాక్. అయితే సాధారణంగా టాలీవుడ్ ఆడియన్స్ మన హీరోలు పూర్తిగా జుత్తుని తీసేస్తే అంగీకరించరు. ఎన్టీఆర్ కాలం నుంచి మహేష్ బాబు దాకా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎవరూ ఆ రిస్క్ చేయలేదు.మహానాయకుడులో బాలకృష్ణ కాసేపు అలా కనిపించినా ఆది ప్రోస్తటిక్ మేకప్. మీడియం రేంజ్ హీరోలూ ఈ ఫీట్ కి దూరం. కాస్త మార్కెట్ ఉన్న ఏ హీరో అలా కనిపించిన దాఖలాలు పెద్దగా లేవు.
కోలీవుడ్ హీరోలు దీనికి భిన్నం. కమల్ హాసన్(అభయ్), రజనీకాంత్(శివాజీ), సూర్య(గజిని), విక్రమ్(సేతు), అజిత్(రెడ్), విశాల్ (సెల్యూట్) ఇలా పెద్ద లిస్టే ఉంది కానీ వీళ్ళలాగే ఎందరో నిజంగానే గుండు చేయించుకుని ఆ పాత్రలను పండించారు. తెలుగులో మాత్రం అరుదు. అయినా సరే సుహాస్ కథను నమ్మి వెనకాడకుండా చేశాడు. రా విలేజ్ డ్రామాగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఫిబ్రవరి 2న మరో ఏడు సినిమాలతో పోటీ పడాల్సి వచ్చినా బజ్ విషయంలో మిగిలిన వాటికంటే ముందు వరసలో ఉంది. కంటెంట్ మెప్పిస్తే హిట్టు పడ్డట్టే.
This post was last modified on January 31, 2024 11:11 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…