Animal
అనుకున్నట్టే యానిమల్ ఓటిటిలో వచ్చాక అంచనాలకు మించిన అరాచకం సృష్టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ మొన్న 26 నుంచి స్ట్రీమింగ్ మొదలుపెట్టాక కేవలం మూడు రోజుల వ్యవధిలో 20 మిలియన్ గంటలకు పైగా వాచింగ్ అవర్స్ (వీక్షించిన గంటలు) నమోదు చేసి కొత్త రికార్డు అందుకుంది. వ్యూస్ లెక్కలో చూసుకుంటే 6 మిలియన్ల 2 లక్షల వ్యూస్ తో ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి దక్కని ఘనతని ఓటిటిలో సొంతం చేసుకుంది. ఇది వచ్చే వరకు ట్రెండింగ్లో ఉన్న సలార్ తెలుగు మూడో ప్లేస్ కు దిగిపోగా ఇతర బాషల డబ్బింగ్ వెర్షన్లో టాప్ టెన్ నుంచి తప్పుకునే దాకా వచ్చింది.
ఈ నెంబర్లన్నీ నెట్ ఫ్లిక్స్ లో అధికారికంగా చూసినవి. అంటే ఆన్ లైన్ పైరసీ, టెలిగ్రామ్ లాంటి యాప్స్, గూగుల్ డ్రైవ్స్ లో షేర్ చేయడం లాంటివి కౌంట్ లోకి రావు. వాటిని పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదు కానీ ఒకవేళ అదే జరిగితే మాత్రం వరల్డ్ రికార్డు ఖాయమని చెప్పొచ్చు. యానిమల్ దూకుడు వారాల తరబడి కొనసాగేలా ఉంది. థియేటర్ రిలీజైన టైంలో మిస్ చేసుకున్న లక్షలాది ఆడియన్స్ ఇప్పుడు దాన్ని స్మార్ట్ స్క్రీన్ మీద ఎగబడి చూస్తున్నారు. డిబేట్లు, విమర్శలు, కౌంటర్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా వాటికి స్పందించడం మానేశారు.
యానిమల్ మానియా ఏ స్థాయిలో ఉందంటే రన్బీర్ కపూర్ సినిమా మొత్తంలో పప్పా అని అనిల్ కపూర్ ని సంబోధించేది కౌంట్ చేసే ఫ్యాన్స్ వచ్చేంత. అక్షరాలా 196 సార్లు ఆ పదాన్ని రన్ విజయ్ ఉచ్చరించాడని వీడియో ప్రూఫ్ తో సహా ఒక అభిమాని పెట్టేసరికి ఏకంగా నిర్మాణ సంస్థనే దాన్ని ట్వీట్ చేసింది. యానిమల్ జోరు చూస్తుంటే నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ నెంబర్స్ పెట్టుకున్న ఆర్ఆర్ఆర్ ని సులభంగా దాటేలా ఉంది. ఫస్ట్ వీక్ మాత్రం యానిమల్ డామినేషన్ స్పష్టంగా బయట పడింది. ఓటిటిలో ఇంత స్థాయి బ్లాక్ బస్టర్ అనిపించుకోవడమంటే మాటలు కాదు.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…