పండగ బాక్సాఫీస్ కు మంచి కిక్ ఇచ్చిన సంక్రాంతి సినిమాల ఓటిటి ప్రీమియర్ల కోసం అభిమానులు ఎదురు చూడటం మొదలైపోయింది. ఒక్క హనుమాన్ మినహాయించి మిగిలినవి బాగా నెమ్మదించిపోవడంతో ఇక డిజిటల్ లో రావడమే బాకీ. ముందుగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నది ‘సైంధవ్’కి. వెంకటేష్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఇంత తీవ్రంగా నిరాశ పరుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫిబ్రవరి 2 అమెజాన్ ప్రైమ్ లో రావొచ్చని డిజిటల్ టాక్. ఒకవేళ ఏదైనా చివరి నిమిషం మార్పు ఉంటే నెక్స్ట్ వీక్ కి వాయిదా పడొచ్చు.
నాగార్జునకి చాలా గ్యాప్ తర్వాత సూపర్ హిట్ అందించిన ‘నా సామిరంగ’ని ఫిబ్రవరి 15 డిజిటల్ వెర్షన్ వదిలే ఆలోచనలో ఉంది హాట్ స్టార్. ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ అప్పటికి థియేటర్ రన్ ముగింపులో ఉంటుంది కాబట్టి క్రేజ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో ఇలా ప్లాన్ చేస్తోందని సమాచారం. ‘గుంటూరు కారం’ని సలార్ తరహాలో కేవలం ఇరవై ఎనిమిది రోజుల నిడివిలో స్ట్రీమ్ చేసే ఒప్పందం ఉంటే మాత్రం మహేష్ బాబుని ఫిబ్రవరి 9 నుంచే నెట్ ఫ్లిక్స్ లో చూసేయొచ్చు. లేదూ అంటే నలభై అయిదు రోజుల గ్యాప్ రెండో ఆప్షన్. దానికిచ్చిన రేట్ కి మొదటిదే జరిగే అవకాశం ఉంది.
ఇక సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హనుమాన్’ని జీ5 సంస్థ మార్చి మూడో వారంకి షిఫ్ట్ చేసిందట. ముందైతే అగ్రిమెంట్ చేసుకునే టైంలో మూడు వారాలు చాలనుకున్నా ఇప్పుడు వచ్చిన అద్భుత స్పందన చూసి తేదీని మార్చుకున్నారట. సో ఇంకో నెలన్నరలో మొత్తం నాలుగు సినిమాలు నిక్షేపంగా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీజైన కెప్టెన్ మిల్లర్ ఇంకో పది రోజుల్లో వచ్చేలా ఉంది. ఇక్కడ వాయిదా పడ్డ అయలాన్ కి సంబంధించిన యాడ్స్ ని సన్ నెక్స్ట్ యాప్ ప్రోమోట్ చేయడం మొదలుపెట్టింది. అతి త్వరలోనే ఉండనుంది.
This post was last modified on January 31, 2024 8:23 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…