సినిమా ఫలితాల మీద కాన్ఫిడెన్స్ ఉన్న చిన్న చిత్రాల మేకర్స్ విడుదలకు ముందు రోజు ప్రీమియర్స్ వేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. గత ఏడాది బేబీ, సామజవరగమన, రైటర్ పద్మభూషణ్ లాంటి చిన్న చిత్రాలకు ప్రీమియర్స్ వేయడం బాగా కలిసి వచ్చింది. ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఆ సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
ఇలా ప్రయత్నించి విఫలమైన చిత్రాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా మళ్లీ ఆ రిస్క్ చేయడానికి రెడీ అయింది. అదే అంబాజీపేట మ్యారేజిబ్యాండు. సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది.
ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజిబ్యాండు రిలీజ్ కావలసి ఉండగా.. అంతకు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ప్రీమియర్స్ వేయబోతున్నారు. సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ ప్రీమియర్ షోలు మంచి టాక్ తెచ్చుకోవడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
అంబాజీపేట మ్యారేజిబ్యాండు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుండడంతో ప్రీమియర్స్ మేలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. సుహాస్ సరసన శివాని నగరం నటించిన ఈ చిత్రంలో చాలా వరకు కొత్త, అప్ కమింగ్ ఆర్టిస్టులే ముఖ్య పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు
This post was last modified on January 30, 2024 8:04 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…