ఇటీవలే విడుదలైన ఫైటర్ వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ హృతిక్ రోషన్ రేంజ్ లో లేవన్నది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం. పఠాన్ స్థాయిలో అభిమానులు అంచనాలు పెట్టుకుంటే వాటిని అందుకోవడంలో తడబడుతోంది. ఓవర్సీస్ లో బాగున్నప్పటికీ మాస్ మార్కెట్లలో ఎదురీదుతోంది. ముఖ్యంగా బిసి సెంటర్స్ ప్రేక్షకులు మొత్తం ఆకాశంలోనే జరిగే యుద్ధాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. దీని తర్వాత హృతిక్ చాలా గ్యాప్ తీసుకోబోతున్నాడు. అతని నెక్స్ట్ మూవీ వార్ 2. దీని గురించి మనకింత ఆసక్తి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మల్టీస్టారర్ కాబట్టి.
ప్రాక్టికల్ గా చూస్తే వార్ 2 రావడానికి ఇంకో ఏడాదిన్నర టైం ఉంది. అప్పటికంతా ఫైటర్ ని జనాలు మర్చిపోయి ఉంటారు. పైగా వార్ 2 యుద్ధ విమానాల నేపథ్యంలో ఉండదు. టెర్రరిజంని ఎదురుకునే హీరోయిజంకి కమర్షియల్ కోటింగ్ ఇచ్చి మతిపోయే యాక్షన్ బ్లాక్స్ తో కట్టిపడేస్తారు. అన్నింటి కన్నా ముఖ్యంగా వార్ 2 నిర్మాతలు యష్ రాజ్ ఫిలిమ్స్. నిర్మాత ఆదిత్య చోప్రా స్క్రిప్ట్ ని కాచి వడబోయడంలో సిద్ధ హస్తుడు. టైగర్ 3 విషయంలో ఆయన లెక్క తప్పినా కూడా మరీ డిజాస్టర్ కాలేదు. ఫైటర్ కు దర్శకుడు సిద్దార్థ ఆనంద్ అయితే వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. సో పోలిక లేదు.
ఎలా చూసుకున్నా ఫైటర్ ఎఫెక్ట్ వార్ 2 మీద పెద్దగా ఉండదు. పైగా వచ్చే సంవత్సరం ఆగస్ట్ లో రిలీజయ్యే నాటికి హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. తారక్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఆశించవచ్చు. యష్ టీమ్ చేసే ప్రమోషన్ల వల్ల అంతర్జాతీయ స్థాయిలో బజ్ వస్తుంది. చిత్రీకరణకు చాలా సమయం తీసుకుంటున్నారు కాబట్టి క్వాలిటీ ప్లస్ కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈసారి పాకిస్థాన్ తీవ్రవాదంని ఎక్కువ హైలైట్ చేయకుండా ఇతర అంశాలకు ప్రాధాన్యత దక్కేలా స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు జరిగాయట. దేవర కాగానే జూనియర్ వార్ 2 సెట్స్ లో అడుగు పెడతాడు.
This post was last modified on January 29, 2024 8:19 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…