సంక్రాంతికి తప్పుకోవడం వల్ల సోలో రిలీజ్ కోరుకున్న ఈగల్ మాట నెరవేర్చేందుకు ఫిబ్రవరి 9 నుంచి ఊరి పేరు భైరవకోన వాయిదా వేసుకోవడానికి అంగీకరించింది. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఫిలిం చాంబర్ తరఫున ప్రెసిడెంట్ గా దిల్ రాజు ప్రకటించేశారు. కీలక సభ్యులతో ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన గతంలో మీటింగ్ జరిగినప్పుడు భైరవకోన ప్రస్తావన తమ దగ్గర రాలేదని, తర్వాత తెలుసుకుని సమర్పకులు అనిల్ సుంకర, నిర్మాత రాజేష్ ని అడిగాక వాళ్ళు ఒప్పుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. సో రూట్ క్లియర్ అయ్యింది.
యాత్ర 2 రాజకీయ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి ఎన్నికల దృష్ట్యా దాన్ని పోస్ట్ పోన్ చేయలేని నిస్సహాయత వల్ల అది ఫిబ్రవరి 8న వస్తుందని స్పష్టం చేశారు. రజనీకాంత్ అతిధిపాత్ర పోషించిన లాల్ సలామ్ సైతం జనవరిలో పండగ వదులుకుని తొమ్మిదికి లాక్ చేసుకుందని, అయినా వాళ్ళు మాకు ఎక్కువ స్క్రీన్లు కావాలని డిమాండ్ చేయడం కనక లిమిటెడ్ రిలీజ్ తోనే అదీ వస్తుందని స్పష్టం చేశారు.సాంకేతికంగా ఈగల్ ఒక్కటే రావడం లేదనేది వాస్తవం. అయితే కాంపిటేషన్ కోణంలో చూసుకుంటే రవితేజకు పోటీ వచ్చే రేంజ్ లో జీవా, విష్ణు విశాల్ లు థ్రెట్ కారనేది నిజం.
మొత్తానికి నిర్మాతల మండలి చొరవ వల్ల ఇలాంటి క్లాష్ లు రాకుండా చూసుకోవడం మంచిదే. వచ్చే జనవరికి తాను ప్రెసిడెంట్ గా ఉండనని, అప్పుడు ఈ తరహా సమస్యలు చూసుకోవడానికి వేరొకరు ఉంటారు కాబట్టి తాను శతమానం భవతి నెక్స్ట్ పేజీ ప్రొడ్యూసర్ గా మాత్రమే కనిపిస్తానని దిల్ రాజు హింట్ ఇచ్చారు. ఊరి పేరు భైరవకోన కొత్త సమీకరణ ప్రకారం ఫిబ్రవరి 16 రిలీజ్ అవుతుంది. అయితే ఆపరేషన్ వాలెంటైన్ టాపిక్ రాలేదు. వరుణ్ తేజ్ ప్రమోషన్లైతే చేస్తూనే ఉన్నాడు. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఈగల్ మీద భారీ నమ్మకంతో ఉన్నారు. ఈ వారం నుంచే పబ్లిసిటీ స్పీడ్ పెంచబోతున్నారు.
This post was last modified on January 29, 2024 6:48 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…