ఇవాళ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నలుగురు టీనేజ్ కుర్రకారు కథతో మ్యాజిక్ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడమే అసలు ట్విస్టు. విజయ్ దేవరకొండ హీరోగా తన కాంబినేషన్ లో ఇదే సితార బ్యానర్ ఎప్పుడో ప్యాన్ ఇండియా మూవీని లాక్ చేసింది. ముందైతే ఫ్యామిలీ స్టార్ తో పాటు దీని షూటింగ్ ని కూడా వీలైనంత సమాంతరంగా చేయాలని రౌడీ హీరో ప్లాన్ చేసుకున్నాడు. కానీ తన సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ చేసుకోవడంతో విడి 12ని పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఫారిన్ షెడ్యూల్స్ లో జరిగిన ఆలస్యం వల్ల ఫ్యామిలీ స్టార్ షూటింగ్ సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఇంత లేట్ అవుతుందని ముందే గుర్తించిన నాగవంశీ, గౌతమ్ తిన్ననూరి టైం వేస్ట్ కాకుండా చేతిలో సిద్ధంగా ఉన్న ఇంకో స్క్రిప్ట్ మ్యాజిక్ ని గుట్టుచప్పుడు కాకుండా మొదలు పెట్టేశారు. పైగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించేందుకు ఒప్పుకోవడంతో తెలుగుతో పాటు తమిళంలోనూ బిజినెస్ చేసే ఛాన్స్ పెరిగింది. స్టార్ క్యాస్టింగ్ అవసరం లేని కొత్త మొహాలు కావడం ఎక్కడా రిస్క్ లేదు. దీంతో మీడియా దృష్టిలో పడకుండా నీట్ గా పని పూర్తి చేసేశారు.
ఇంకో నెల రోజుల్లో ఫ్యామిలీ స్టార్ గుమ్మడికాయ కొట్టేస్తారు కాబట్టి విడి 12కి రూట్ క్లియర్ అవుతుంది. ఈలోగా గౌతమ్ ఈ మ్యూజిక్ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఫ్రీ అవుతాడు. సమయం ఆదా చేసుకోవడం కోసం ఇలా ప్లాన్ చేసుకోవడం మంచిదే. పైగా ఒక పెద్ద హీరోతో ప్రాజెక్టు లైన్ లో ఉన్నా సరే కొత్త క్యాస్టింగ్ తో ఒక రామ్ కామ్ తీసేందుకు గౌతమ్ సిద్ధపడటం ఆహ్వానించదగిన ట్రెండ్. విజయ్ దేవరకొండ మూవీకి భారీ బడ్జెట్ అవసమవుతోంది. ఇంకా హీరోయిన్ ఎంపిక చేయలేదు. శ్రీలీల అన్నారు కానీ ఇప్పుడు డౌటేనట. ఏప్రిల్ లో ఓ కొలిక్కి రావొచ్చు.
This post was last modified on January 29, 2024 6:48 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…