బాలీవుడ్ లో దర్శకుడిగా, నిర్మాతగా, యాంకర్ గా సుపరిచితుడైన కరణ్ జోహార్ ఇవాళ కొత్త సినిమా ఒకటి వెరైటీగా అనౌన్స్ చేశారు. మల్టీ స్టారర్ రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఇటీవలే సౌత్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో, భావోద్వేగాలతో అందరిచేత ప్రేమించబడిన ఒక నటి, ఒక స్టార్ లెగసి కుటుంబం నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్న కుర్రాడు అంటూ హింట్స్ ఇచ్చాడు. షూటింగ్ అయిపోయిందని, ఈ ముగ్గురు గురించి పజిల్ లాగా పెట్టి ఊరించాడు. దక్షిణాది స్టార్ అనగానే ప్రభాస్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు. అసలు మ్యాటర్ వేరే.
కరణ్ జోహార్ చెప్పింది సర్ జమీన్ అనే సినిమా గురించి. దీంట్లో సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించగా అతనికి జోడిగా సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించింది. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూగా ఇది రూపొందుతోంది. ఇంత బిల్డప్ ఇచ్చింది వీళ్ళ గురించే. పాకిస్థాన్ టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో కాశ్మీర్ సరిహద్దుల్లోని ఉద్రిక్తతల ఆధారంగా రూపొందింది. దర్శకత్వం కరణ్ కాదు. ఆ బాధ్యతను కొత్తోడికి అప్పగించాడు. పేరు కయోజ్ ఇరానీ. ఇతనికి డెబ్యూ డైరెక్షనే. బడ్జెట్ పరంగా భారీగా ఖర్చు పెట్టారట.
దీంతో రకరకాల ఊహాగానాలు చేసుకుంటున్న నెటిజెన్లకు ఇదే సమాధానం. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి ఈ వేసవికే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే సలార్ తో తెలుగులో పేరు తెచ్చుకున్న పృథ్విరాజ్ హిందీలో బడేమియా చోటేమియాలోనూ నటించాడు. కేవలం మలయాళంకు పరిమితం కాకుండా ఇతర భాషలకు విస్తరిస్తున్నాడు. సలార్ 2 శౌర్యంగ పర్వంలో నిడివి ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో భారీగా డేట్లు అవసరమయ్యేలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ నుంచి కాల్ రావడం ఆలస్యం షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభించే సూచనలున్నాయి.
This post was last modified on January 28, 2024 9:19 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…