యానిమల్ విలన్ బాబీ డియోల్ కు హిందీలో ఏమో కానీ సౌత్ లో మాత్రం విపరీతమైన డిమాండ్ వచ్చేస్తోంది. చాలా కాలంగా సరైన బ్రేక్ లేక బాలీవుడ్ డైరెక్టర్లకే ఛాయస్ కాకుండా పోయిన ఈ సీనియర్ హీరోని ఇప్పుడు దక్షిణాది దర్శకులు కోరిమరీ తీసుకుంటున్నారు. ముందు బోణీ జరిగింది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో. ఔరంగజేబుగా కీలకమైన పాత్ర దక్కింది కానీ కొంత భాగం షూటింగ్ అయ్యాక బ్రేక్ పడింది. జనసేన కార్యకలాపాలు, ఏపీ ఎన్నికల కోసం పవన్ విరామం తీసుకోవడంతో తిరిగి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి బాబీ డేట్స్ ని తనకే తిరిగి ఇచ్చారని టాక్.
సూర్య కంగువాలో తన లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. మెయిన్ విలన్ తనేనట. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని సిరుతై శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది క్లిక్ అయితే కోలీవుడ్ లో జెండా పాతొచ్చు. తాజాగా బాలకృష్ణ బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కి బాబీనే అసలు ప్రతినాయకుడు. క్రూరమైన బందిపోటుగా పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. బాలయ్య బాబీ డియోల్ కు మధ్య జరిగే సన్నివేశాలు ఊహించనంత పీక్స్ లో ఉంటాయని వినికిడి.
కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చిరంజీవి విశ్వంభర కోసం ట్రై చేస్తున్నారట. అయితే డేట్స్ ఎక్కువ అవసరం ఉండటంతో ఆ మేరకు బాబీ డియోల్ వద్ద కాల్ షీట్లు లేనందు వల్ల గ్యారెంటీగా చెప్పలేమని యూనిట్ టాక్. యానిమల్ లో చేసింది తక్కువ స్పేస్ ఉన్న మూగ పాత్రే అయినా దానికి ప్రేక్షకులు కనెక్ట్ అయిన తీరు మాములుగా లేదు. రన్బీర్ కపూర్ విపరీత హీరోయిజంతో సమానంగా అబ్రార్ క్రూరత్వాన్ని ఎంజాయ్ చేశారు. ఇంకో ఒకటి రెండు హిట్లు పడితే బాబీ డియోల్ కొన్నేళ్లు నిక్షేపంగా హైదరాబాద్ లోనే సెటిల్ కావొచ్చు.
This post was last modified on January 27, 2024 9:23 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…