ఈగల్ కి ఎలాగైనా సోలో రిలీజ్ ఇప్పించాలని ఫిలిం చాంబర్ చేసిన ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టే. యాత్ర 2 రాజకీయ ప్రయోజనాలతో కూడిన సినిమా కాబట్టి దానికి మినహాయింపునిచ్చి ఊరి పేరు భైరవకోనని ఫిబ్రవరి 9కి బదులు 16 రిలీజ్ చేసేందుకు దాదాపు అంగీకారం జరిగిందని అంతర్గత సమాచారం. అధికారికంగా ఏకె ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. గోపిచంద్ భీమా మార్చికి వెళ్లిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ తప్పుకున్నట్టు ఎలాంటి అప్డేట్ లేకపోవడం అనుమానాలు పెంచుతోంది.
దీనికి సంబంధించిన ప్రమోషన్లు యధావిధిగా జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ విస్తృతంగా తిరుగుతూ పబ్లిసిటీలో భాగమవుతున్నాడు. ఇటీవలే రిలీజైన హృతిక్ రోషన్ ఫైటర్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొంది ఆశించిన స్థాయిలో అద్భుతాలు చేయడం లేదు. కలెక్షన్లు బాగానే ఉన్నా హీరో రేంజ్ కు తగ్గట్టు రెస్పాన్స్, రివ్యూలు లేవని అర్థమైపోయింది. అదే తరహా నేపథ్యం ఉన్న ఆపరేషన్ వాలెంటైన్ ఇంత తక్కువ గ్యాప్ లో ప్యాన్ ఇండియా రిలీజ్ చేసుకుంటే పోలికలు వస్తాయేమోననే డౌట్ అభిమానుల్లో లేకపోలేదు. కానీ సోని పిక్చర్స్ మాత్రం ఇప్పటికైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు.
మొన్న జరిగిన మీటింగ్ లో ఆపరేషన్ వాలెంటైన్ రాదనే రీతిలో మాట్లాడుకున్నారట. ఇంకో రెండు మూడు రోజులు ఆగితే కానీ స్పష్టత రాదు. ఒకవేళ తప్పుకోకపోయినా ఊరి పేరు భైరవకోనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రెండు వేర్వేరు జానర్లు. మాస్ సెంటర్స్ లో విరూపాక్ష లాగా సందీప్ కిషన్ మూవీకే ఎక్కువ బజ్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టే ఫిబ్రవరి 15నే ప్రధాన కేంద్రాల్లో ప్రీమియర్లు వేసే ప్లాన్ కూడా ఉంది. హనుమాన్ కి ఈ ప్లాన్ ఎంత బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యిందో చూశాం. సంక్రాంతి లాగే ఫిబ్రవరి రిలీజులు కూడా ఎడతెగని సస్పెన్స్ లో కొనసాగుతున్నాయి.
This post was last modified on January 27, 2024 6:09 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…