Movie News

అంతు చిక్కని అల్లు అర్జున్ ప్లానింగ్

నిన్న గీత ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శీను దర్శకుడిగా అల్లు అరవింద్ కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడో సరైనోడు టైంలో ఇచ్చిన కమిట్ మెంట్ ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. అయితే హీరో ఎవరో చెప్పకపోవడంతో ఇది అల్లు అర్జున్ తోనే అయ్యుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి సాలిడ్ లీక్ బయటికి రాలేదు. ఒకవేళ కాసేపు నిజమే అనుకున్నా బన్నీ ప్లానింగ్ అంతుచిక్కని రీతిలో కనిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నా తర్వాత చేయబోయే సినిమాల మీద సస్పెన్స్ కొనసాగుతోంది.

అధికారికంగా అల్లు అర్జున్ కమిట్ మెంట్ ఇచ్చింది ఇద్దరికే. ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది ఆయన రెగ్యులర్ గా డీల్ చేసే ఫ్యామిలీ తరహా సబ్జెక్టు కాదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఫాంటసీ టచ్ ఉంటుందని గతంలో నిర్మాత నాగవంశీ ఓ సందర్భంలో అన్నారు. కానీ స్క్రిప్ట్ కి చాలా టైం అవసరం కానుంది. మరొకరు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ నిర్మాతలు టి సిరీస్ ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్. అయితే వంగా ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్ అయ్యాకే బన్నీతో చేతులు కలుపుతాడు. ఈలోగా బన్నీ ఆట్లీతో ఓ సినిమా చేయొచ్చనే ప్రచారం జోరుగా తిరుగుతోంది.

ఇప్పుడు హఠాత్తుగా బోయపాటి శీను వచ్చి చేరారా అనేది వేచి చూడాల్సిన ప్రశ్న. ప్రకటనలో మాస్ కాంబో అన్నారు కానీ హీరో పేరు క్లూ లేకుండా చూసుకున్నారు. పుష్ప తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న అల్లు అర్జున్ ఆ కారణంగానే వేణు శ్రీరామ్ కి ఐకాన్ ఓకే చేసి తర్వాత డ్రాప్ అయ్యాడు. అతను నితిన్ తో తమ్ముడు చేసుకుంటున్నాడు. నిర్మాత దిల్ రాజు సైడయ్యారు. బాలయ్యతో అఖండ 2 తాలూకు న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నా ఈ కోణాల వెనుక చిక్కుముడి వీడాలంటే ముందు హీరో సంగతి తేలాల్సిందే.

This post was last modified on January 27, 2024 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

46 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago