సంక్రాంతి టైంలో రిలీజ్ డేట్ల గురించి ఎంత పంచాయితీ నడిచిందో తెలిసిందే. అనివార్య పరిస్థితుల్లో ఈగల్ చిత్రాన్ని పండుగ రేసు నుంచి తప్పించారు. ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ డేట్ ఇస్తామన్న నిర్మాతల మండలి హామీ మేరకే ఈగల్ మేకర్స్ ఆ చిత్రాన్ని సంక్రాంతి పోటీ నుంచి తప్పించారు. కానీ ఇప్పుడు చూస్తే ఫిబ్రవరి 9న మరో మూడు సినిమాలు రాబోతున్నాయి.
అందులో వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర-2, అనువాద చిత్రం లాల్ సలాం గురించి పెద్దగా కంగారు లేదు. కానీ ఊరి పేరు భైరవకోన సినిమా నుంచి మాత్రం ఇబ్బంది తప్పదని భావిస్తోంది ఈగల్ టీమ్. అందుకే సోలో రిలీజ్ డేట్ హామీ గురించి ప్రస్తావిస్తూ నిర్మాతల మండలికి లేఖ కూడా రాశారు.
దీంతో మండలి పెద్దలు ఈ విషయమై సమావేశం నిర్వహించారు. కానీ ఊరి పేరు భైరవకోన చిత్ర బృందం మాత్రం ఫిబ్రవరి 9నే రావాలని పట్టుబట్టి ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్లను కన్విన్స్ చేయడానికి నిర్మాతల మండలి కొత్త ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వారం రోజులు వాయిదా వేసుకుంటే దానికి సోలో రిలీజ్ డేట్ దక్కేలా చూస్తామన్నారట.
వరుణ్ తేజ్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్, గోపీచంద్ సినిమా భీష్మ 16న రావాల్సి ఉన్నాయి. అయితే ఆ రెండు చిత్రాలు వాయిదా పడే సూచనలు ఉండడంతో.. ఆరోజు మరే మరే సినిమా రాకుండా చూస్తామని ఫిబ్రవరి 9న ఖాళీ చేయాలని ఊరి పేరు భైరవకోన టీంను కోరినట్లు సమాచారం. మరి ఈ ప్రతిపాదనకు ఆ చిత్ర బృందం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on January 26, 2024 7:37 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…