ప్యాన్ ఇండియా సినిమాల విడుదల తేదీలకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలు అభిమానులను విపరీతమైన టెన్షన్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దేవర అప్డేట్ తెలిశాక మిగిలిన వాటి మీదా అనుమానం కలుగుతోంది. గత రెండు రోజులుగా ఆగస్ట్ 15 లాక్ చేసుకున్న పుష్ప 2 ది రూల్ సైతం పోస్ట్ పోన్ అయ్యేదారిలో ఉందని, దాని స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తారని తెగ చర్చించుకుంటున్నారు. అయితే అల్లు కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు పుష్ప 2 రిలీజ్ తగ్గేదేలే అంటూ అనౌన్స్ చేసిన డేట్ కి వచ్చేందుకు రెడీ అవుతోందట.
దర్శకుడు సుకుమార్ బృందం ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవమే. ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. కథలో కీలక పాత్ర పోషిస్తున్న జగదీశ్ ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో ఇరుక్కోవడం పెద్ద సమస్యను తెచ్చి పెట్టింది. బయట కనిపించడం లేదు కానీ ఇతన్ని కొద్దిరోజుల క్రితమే బెయిలు మీద తీసుకొచ్చారట. సుమారు పదిహేను లక్షల దాకా ఖర్చయ్యిందని ఫిలిం నగర్ టాక్. అధికారిక ధృవీకరణ లేదు. సైలెంట్ గా వచ్చి తన సీన్లను చేసుకుని వెళ్తున్నాడని, సెట్లో ఎవరినీ పలకరించే పరిస్థితి లేదని యూనిట్ నుంచి వస్తున్న న్యూస్. తన భాగాన్ని వీలైనంత వేగంగా తీసేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నారట.
ఈ లెక్కన ఆగస్ట్ 15 రావడం అసాధ్యమేమీ కాదు. రష్మిక మందన్నను నలభై రోజుల కాల్ షీట్స్ అడిగారనే ప్రచారం నేపథ్యంలో వాయిదా వార్తలకు రెక్కలు వచ్చాయి. అయితే చేతిలో ఇంకా అయిదు నెలల సమయం ఉంది కాబట్టి డెడ్ లైన్ మీట్ కావడం కష్టమేమి కాదని పుష్ప టీమ్ భావిస్తోంది. ప్రమోషన్ల కోసం ఎంతలేదన్నా నెల రోజుల సమయం కావాలి కనక జూలైకే ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ పబ్లిసిటీకి ఎక్కువ టైం దొరక్కపోతే సలార్ ని అనుసరిస్తూ ముందు సినిమా రిలీజ్ చేసి ఆ తర్వాత ప్రమోషన్లలో ఊపు తీసుకొస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి.
This post was last modified on January 26, 2024 5:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…