Movie News

మంచి రీమేక్ ఛాన్స్ వదులుకున్నారు

గత డిసెంబర్ ఇరవై రెండున సలార్ తో పాటు విడుదలై కేరళలో సంచలన విజయం నమోదు చేసిన నేరు ఏకంగా వంద కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం ఆశ్చర్యపరిచింది. దృశ్యం లాంటి మాస్టర్ పీస్ అందించిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో అంచనాలకు తగ్గట్టు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. పెద్దగా బడ్జెట్ లేకుండా కేవలం రెండు మూడు లొకేషన్లు, ఒక కోర్టు సెట్, మొత్తం ఒక పాతిక మంది ఆర్టిస్టులతో రెండున్నర గంటలు మెప్పించిన విధానం విమర్శకులను మెప్పించింది. కట్ చేస్తే మొన్నటి నుంచి నేరు చక్కని తెలుగు డబ్బింగ్ తో పాటు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఒక కళ్ళు లేని అమ్మాయి మీద మానభంగం జరిగితే ఆమెకు అండగా నిలబడే ఒక లాయర్ పోరాటమే ఈ కథ. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో నటీనటులు పోటీ పడ్డారు. అయితే దీన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ లేదా వెంకటేష్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని మలయాళం వెర్షన్ చూసిన వాళ్ళు అభిప్రాయపడ్డారు. దృశ్యం 2 నుంచి వెంకీతో ఉన్న అనుబంధం దృష్ట్యా జీతూ జోసెఫ్ కాల్ చేసి అడిగారట. అయితే సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న కమిట్ మెంట్లు పూర్తి చేయడానికే టైం సరిపోవడం లేదు. కొత్తవి ఒప్పుకునే పరిస్థితి ఎంత మాత్రం లేదు.

చూస్తుంటే ఒక మంచి రీమేక్ చేతులారా వదలేసినట్టు అయ్యింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా పూనుకున్నా నేరుని మన ఆడియన్స్ అధిక శాతం చూసేస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చే అసలు ట్విస్టుతో పాటు మొత్తం గుర్తు పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఎవరు చేసినా అంత థ్రిల్ ఫీలవ్వరు. సోషల్ మీడియాలో నేరు మీద కాంప్లిమెంట్ల వర్షం కురుస్తోంది. ప్రత్యేకంగా పోస్టులు పడుతున్నాయి. అధిక భాగం సినిమా కోర్టులోనే సాగినా స్క్రీన్ ప్లేతో విసుగు రాకుండా మానేజ్ చేసిన జీతూ జోసెఫ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఏది ఏమైనా తక్కువ బడ్జెట్ లో అయిపోయే క్వాలిటీ కంటెంట్ మిస్ అయినట్టే.

This post was last modified on January 25, 2024 11:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

4 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

6 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

7 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

8 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

8 hours ago