Movie News

సలార్‌కు రికార్డ్ వ్యూస్.. అదే కారణం

థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన అన్ని సినిమాలూ ఓటీటీల్లో, టీవీల్లో బాగా ఆడేస్తాయని లేదు. ఆల్రెడీ థియేటర్లలో ఎక్కువమంది చూడటం వల్ల కొన్ని సినిమాలకు ఓటీటీల్లో, టీవీల్లో వ్యూయర్ షిప్ తక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే థియేటర్లలో సరిగా ఆడని చిత్రాలు ఓటీటీల్లో మంచి స్పందన తెచ్చుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఐతే కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్లలోనే కాక ఓటీటీల్లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటాయి. సలార్ సినిమా ఆ కోవకు చెందిందే.

క్రిస్మస్ కానుకగా రిలీజైన ప్రభాస్ సినిమా భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అక్కడా అదిరిపోయే స్పందన వచ్చింది. తెలుగు వెర్షన్ రిలీజైన దగ్గర్నుంచి ఈ ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మిగతా భాషల వెర్షన్లు కూడా మంచి వ్యూయర్ షిప్‌ తెచ్చుకుంటున్నాయి.

‘సలార్’కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చినట్లుగా నెట్ ఫ్లిక్స్ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్’కు ఓటీటీలో ఇంత మంచి స్పందన రావడానికి ఒక కారణం ఉంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాను థియేటర్లలో చూడని వాళ్లంతా ఓటీటీలో చూస్తారు. అలాగే థియేటర్లో చూసిన వాళ్లు కూడా ఇంకోసారి ఇక్కడ ఓ లుక్ వేసే ఛాన్సుంది. అందుక్కారణం.. ప్రశాంత్ నీల్ మార్కు కన్ఫ్యూజింగ్ నరేషనే. అతడి సినిమాల్లో బోలెడన్ని పాత్రలుంటాయి. కథ అంత సులువుగా అర్థం కాదు. బోలెడన్ని థియరీలు ఉంటాయి. సూటిగా చెప్పని విషయాలుంటాయి.

‘కేజీఎఫ్’ సినిమాను కూడా తొలిసారి చూసి పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. చాలామంది ఓటీటీలో మళ్లీ మళ్లీ చూసే కథను పూర్తిగా అర్థం చేసుకున్నారు. ‘సలార్’ కూడా అంతే గందరగోళంగా సాగింది. థియేటర్లో చూసిన వాళ్లు కూడా మళ్లీ ఓటీటీలో ఓసారి చూస్తే తప్ప కథను అర్థం చేసుకోలేరు. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో దీనికి భారీ వ్యూయర్ షిప్ వస్తోంది. ప్రశాంత్ ప్రతి సినిమాకూ ఇదే ఫార్ములా అప్లై చేసుకోవచ్చేమో.

This post was last modified on January 24, 2024 8:53 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

4 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

9 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

10 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago