పేరుకు మహేష్ బాబు మద్దతు ఉన్న మాటే కానీ స్వంతంగా ఎదిగేందుకు కష్టపడుతున్న సుధీర్ బాబుకి గత కొంత కాలంగా ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా సరే సక్సెస్ దూరంగా ఉంటోంది. వినడానికి బాగున్నాయనిపించే కథలు తీరా తెరపైకి వచ్చే క్రమంలో దర్శకుల తప్పుల వల్ల డిజాస్టర్లవుతున్నాయి. మామా మశ్చీంద్ర, హంట్, శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వేటికవే కాన్సెప్ట్ పరంగా కమర్షియల్ సబ్జెక్టులు కాదు. అందుకే ఈసారి పద్దతి మార్చి ఒకే సినిమా అనుభవమున్న జ్ఞాన సాగర్ తో హరోం హర చేస్తున్నాడు. పీరియాడిక్ ఇంటెన్స్ డ్రామాగా ఇది రూపొందుతోంది.
ఇప్పుడు పాయింట్ దీని గురించి కాదు. నటనకు స్కోప్ ఉంటే హీరోకు ఛాలెంజ్ చేసే నెగటివ్ పాత్రలైనా సరే ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సుధీర్ బాబు సంకేతాలు పంపిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అందులో భాగంగా రవితేజ మూవీలో అలాంటి పాత్రే ఒకటి వస్తే ఎస్ చెప్పాలా వద్దాని ఆలోచించే పనిలో ఉన్నట్టు వినికిడి. గతంలో బాలీవుడ్ మూవీ భాగీలో టైగర్ శ్రోఫ్ కి సవాల్ విసిరే విలన్ గా చేసిన క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఇక్కడ సెటిలవ్వాలన్న ఉద్దేశంతో మళ్ళీ హిందీ ఆఫర్లు ఏవి వచ్చినా వద్దని చెప్పారు. తెలుగులోనూ అలాంటివి చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఉందట.
సన్నిహితుల దగ్గర దీని గురించి మాట్లాడుతూ గతంలో సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అంతం కాదిది ఆరంభం, మానవుడు దానవుడు లాంటి డ్యూయల్ షేడ్స్ సినిమాలు చేసి హిట్లు కొట్టారు కాబట్టి తానూ ఆ తరహాలో వెళ్తే తప్పేమిటన్న కోణంలో అభిప్రాయం చెప్పారట. అయితే అఫీషియల్ గా ఏదీ బయటికి రాలేదు కాబట్టి ఇదంత ప్రస్తుతానికి గాసిప్ గానే చూడాలి. పుల్లెల గోపిచంద్ బయోపిక్ ఆగిపోవడం సుధీర్ బాబుని వ్యక్తిగతంగా నిరాశపరిచింది. హరోం హర విడుదలను సరైన తేదీ దొరికే దాకా అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవచ్చు. మార్చిలో తేవాలని ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on January 24, 2024 6:17 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…