ఏప్రిల్ 5 విడుదల కావాల్సిన దేవర వాయిదా పడటం ఖాయమని నిన్న సాయంత్రం నుంచి మీడియాతో మొదలుపెట్టి ఆన్ లైన్ సమూహం దాకా ప్రపంచం మొత్తం కోడై కూస్తోంది. యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అనే రీతిలో కథనాలు వచ్చేశాయి. మౌనం అంగీకారానికి సూచనన్నట్టు నిర్మాణ భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ రామ్ టీమ్ సైలెంట్ గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉగాది పండగతో పాటు లాంగ్ వీకెండ్ ని లక్ష్యంగా పెట్టుకుని చాలా ప్లాన్డ్ గా నిర్ణయించుకున్న తేదీ ఇది. వదులుకుంటే తారక్ ఫ్యాన్స్ కి నరకమే.
ఒకవేళ నిజంగా అన్నంత పని జరిగితే ఈ స్లాట్ ని వాడుకునేందుకు ఫ్యామిలీ స్టార్ కి ఇంతకన్నా ఛాన్స్ దొరకదు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. రౌడీ హీరోకి బ్లాక్ బస్టర్ వచ్చి చాలా కాలమైనా ఓపెనింగ్స్ మీద పట్టున్న విషయం ఖుషితో అర్థమైపోయింది. కంటెంట్ కనక అందరికీ కనెక్ట్ అయ్యుంటే ఫలితం ఇంకోలా ఉండేది. సరే దాని సంగతి పక్కనపెడితే ఏప్రిల్ మొదటివారానికి స్కూల్ పిల్లల పరీక్షలు అయిపోయి సెలవుల్లో ఉంటారు కాబట్టి వసూళ్లకు ఢోకా ఉండదు.
నిర్మాత దిల్ రాజు ఇప్పుడీ టార్గెట్ తోనే యూనిట్ ని పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం. ఇంకా ఎంత బ్యాలన్స్ ఉందనేది బయటికి రావడం లేదు. ఫారిన్ షెడ్యూల్ ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పకుండా దాస్తున్నారు. లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఉండటం మరో సానుకూలాంశం. ఎలాగూ టిల్లు స్క్వేర్ మార్చి నెలాఖరుకి వచ్చేలా ఉంది. అలా జరిగినా ఫ్యామిలీ స్టార్ కు ఇబ్బంది లేదు. రెండు వేర్వేరు జానర్లు కావడంతో సమస్య లేదు. మళ్ళీ రెండో వారం ఇండియన్ 2 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే వచ్చేయడం సేఫ్. దేవర అధికారికంగా చెప్పేదాకా ఈ వ్యవహారం తేలదు.
This post was last modified on January 24, 2024 10:54 am
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…