హీరోయిన్లు పెళ్లికి ముందు వరకు ఎలాంటి పాత్రలైనా చేస్తారు కానీ.. పెళ్లి తర్వాత మాత్రం ట్రెడిషనల్ రోల్స్ లోకి మారిపోతారు. కొంతమంది అయితే పూర్తిగా నటనకే దూరమవుతారు. సినిమా కుటుంబాల్లోకి కోడళ్లుగా వెళ్ళిన వాళ్ళు కూడా నటనకు దూరమైన ఉదాహరణలు ఉన్నాయి టాలీవుడ్లో. అమల, ఊహ లాంటి వాళ్ళు అందుకు ఉదాహరణ.
మరి మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెట్టిన లావణ్య త్రిపాఠి సంగతి ఏమిటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పెళ్లి తర్వాత లావణ్య నటనకు ఏమీ దూరం కాలేదు. మిస్ పర్ఫెక్ట్ పేరుతో ఒక వెబ్ సిరీస్ లో నటించింది. మరి ఎలాంటి పాత్రలు చేయాలనే విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా కండిషన్లు పెట్టారా అనే ప్రశ్న లావణ్యకు ప్రమోషనల్ ప్రెస్ మీట్లో ఎదురైంది.
దీనికి బదులిస్తూ లావణ్య.. పెళ్లికి ముందు కూడా తనకు తన కుటుంబంలో ఎవరు కండిషన్లు పెట్టలేదని.. తనను స్వేచ్ఛగా వదిలేశారని.. తాను తన పరిమితుల్లో నచ్చిన పాత్రలు చేశానని చెప్పింది. పెళ్లి తర్వాత కూడా వరుణ్ ఫ్యామిలీ నుంచి తనకు ఎలాంటి కండిషన్లు లేవని ఆమె తెలిపింది. కానీ మెగా ఫ్యామిలీ కోడలిగా తన లిమిటేషన్లు ఏంటో తనకు తెలుసని లావణ్య చెప్పింది.
లావణ్య త్రిపాఠి, మెగా కోడలు.. ఈ రెండు ట్యాగ్స్ లో ఏది ఇష్టమని అడిగితే తనకు తానుగా గుర్తింపు తెచ్చుకున్నది లావణ్య త్రిపాఠినే కాబట్టి ముందు అదే ఇష్టమని.. అదే సమయంలో మెగా కోడలు అని ట్యాగ్ తనకి ఎంతో స్పెషల్ అని ఆమె వెల్లడించింది. భర్తగా వరుణ్ తేజ్ ఎన్నో విషయాల్లో బెస్ట్ అని.. తనకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తాడని లావణ్య పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates