Movie News

ఆదిపురుష్ గాయం ‘హనుమాన్’తో మాయం

కొన్ని బాక్సాఫీస్ విచిత్రాలు కాకతాళీయమైనా సరే భలే అనిపిస్తాయి. అలాంటిదే ఇది. గత ఏడాది ఆదిపురుష్ ని నైజామ్ లో మైత్రి సంస్థ పంపిణి చేసింది. భారీ అంచనాలు ఉండటంతో పాటు ప్రభాస్ ఇమేజ్, రామాయణం సెంటిమెంట్ కనకవర్షం కురిపిస్తాయని నమ్మి పోటీకి వెళ్లి మరీ హక్కులు కొన్నారు. ఒకదశ వరకు దిల్ రాజు రేస్ లో ఉండి తర్వాత రేటు చూసి డ్రాపయ్యారు. తీరా చూస్తే అంత ప్యాన్ ఇండియా మూవీ ఫ్లాప్ కావడం దెబ్బ కొట్టింది. ఓపెనింగ్స్ గ్రాండ్ గా వచ్చినా టాక్ వాటిని నిలబెట్టలేదు. ఫలితంగా ఒక్క ఆ ఏరియా నుంచే పన్నెండు కోట్లకు పైగా నష్టం వచ్చిందని ట్రేడ్ టాక్.

ఇప్పుడది మైత్రికి పూర్తిగా తీరిపోయింది.హనుమాన్ టికెట్ కౌంటర్లు లాభాల సునామిలో మునిగి తేలడంతో మైత్రి మేకర్స్ జాక్ పాట్ కొట్టారు. విడుదల రోజు డిస్ట్రిబ్యూషన్ పరంగా హనుమాన్ ఎన్ని ఇబ్బందులు పడిందో చూశాం. ఫస్ట్ డే హైదరాబాద్ మొత్తం నాలుగు సింగల్ స్క్రీన్లు ఇచ్చారు. మల్టీప్లెక్సుల షోలు అధికంగా గుంటూరు కారంకు వెళ్లాయి. ఏషియన్ ఫిలింస్ తో తలెత్తిన సమస్య వల్ల సకాలంలో వాళ్ళ థియేటర్లు ఇవ్వలేకపోయినా తర్వాత సద్దుమణిగింది. రివర్స్ లో తేజ సజ్జ కౌంట్ పెరిగి మహేష్ బాబువి తగ్గడం మొదలయ్యాయి. దీంతో హనుమాన్ బంగారు గుడ్లు పెట్టే బాతుగా మారిపోయింది.

కొన్న ప్రతిఒక్కరికి రూపాయికి కనీసం అయిదు రూపాయల లాభం ఇచ్చే దిశగా హనుమాన్ దూసుకుపోతోంది. సుమారు ఏడు కోట్లకు కొంచెం అటు ఇటుగా నైజామ్ థియేట్రికల్ రైట్స్ అమ్మితే పది రోజులకే షేర్ ఇరవై ఆరు కోట్లు దాటడం మాములు సంచలనం కాదు. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు. ఫిబ్రవరి తొమ్మిది దాకా నెమ్మదించడం కష్టమేనని బయ్యర్ల మాట. దీనికి ధీటుగా కంటెంట్ ఉన్న కొత్త రిలీజ్ ఏవీ అప్పటిదాకా లేకపోవడం ప్లస్ అవుతోంది. ట్విస్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల మొత్తం బిజినెస్ ఒక నైజామ్ లోనే వసూలు కావడం. హనుమాన్ దెబ్బా మజాకాని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

This post was last modified on January 23, 2024 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లోరల్ ఫ్రాక్ లో వన కన్యాలా మైమరిపిస్తున్న అషికా!

ఇన్స్టాగ్రామ్ లో తన క్యూట్ ఫొటోస్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ ఆషికా రంగనాథ్‌. 2023లో కళ్యాణ్ రామ్…

10 mins ago

ఏపీ రాజ‌ధానిలో తొలి ప్రైవేటు నిర్మాణం.. బాల‌కృష్ణ ఆసుప‌త్రికి శ్రీకారం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో తొలి ప్రైవేటు నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖ‌రారైనట్టు తెలిసింది. రాజ‌ధాని ప్రాంతంలో 2015-17 మ‌ధ్య న‌టుడు,…

58 mins ago

ఎన్నిక‌ల త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్‌: ఏపీకి ప్ర‌ధాని మోడీ

ఏపీకి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీ రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌-మే మ‌ధ్య జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్ర‌ధాని…

1 hour ago

పంజాబ్ ప్రీతి.. శ్రేయస్ కోసం అంత రేటెందుకంటే…

ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదనేది అందరికీ తెలిసిందే. 2014లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ,…

2 hours ago

భలే థ్రిల్లర్లు తీస్తారయ్యా బాబూ ఈ మలయాళీలు!

దృశ్యంతో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన జీతూ జోసెఫ్ ప్రభావం మలయాళ పరిశ్రమ మీద చాలా…

2 hours ago