సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే కొత్త చిత్రం.. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తాడన్నది చాలా ముందుగానే ఖరారైన విషయం. తన కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నప్పటికీ.. ఎన్నో ఏళ్ల కిందట ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కరుగా సీనియర్ నిర్మాతలకు సినిమాలు చేస్తూ వస్తున్నాడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని డీవీవీ దానయ్యకు అలాగే చేశాడు.
నారాయణకు ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఐతే బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. ఆయనతో సినిమా చేయడానికి హాలీవుడ్ స్టూడియోలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమానే చేయని నారాయణకు ఈ మెగా మూవీని అప్పగించడం ఏంటి అనే చర్చ జరిగింది.
నారాయణను వాటాదారుగా కొనసాగిస్తూ వేరే సంస్థలు రాజమౌళి-మహేష్ బాబు సినిమాను టేకోవర్ చేస్తున్నట్లుగా కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర వర్గాలను సంప్రదిస్తే.. అది నిజం కాదని తేలిందట. నారాయణనే ఈ చిత్రానికి హోల్ అండ్ సోల్ నిర్మాత అని అంటున్నారు. చాలా ఏళ్లుగా సినిమాలు చేయకపోయినా.. దుర్గా ఆర్ట్స్ బేనర్లో గతంలో ఎన్నో పెద్ద చిత్రాలు నిర్మించిన అనుభవం ఉంది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాక నారాయణ రియల్ ఎస్టేట్ మీద దృష్టిపెట్టారు.
ఆయనకు పెట్టుబడుల విషయంలో ఢోకా ఏమీ లేదు. ఎంత కావాలన్నా పెడతారు. ఇక రాజమౌళి అండ్ టీంకు ప్రొడక్షన్ మీద ఉన్న పట్టుగురించి తెలిసిందే. కాబట్టి ఎంత పెద్ద సినిమానైనా డీల్ చేయడంలో ఇబ్బంది లేదు. అందుకే ఈ సినిమాలోకి వేరే వాళ్లు ఎవ్వరినీ రానివ్వడం లేదని.. రాజమౌళి-నారాయణ వాటాలు మాట్లాడుకుని సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారని సమాచారం.
This post was last modified on January 23, 2024 6:40 am
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…