ఒకపక్క అయోధ్య రామాలయంలో బాలరాముడి సాక్షాత్కారం జరుగుతుండగానే ఇంకో వైపు హనుమాన్ 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టిన వార్త భక్తి ప్లస్ సినీ ప్రియులు ఇద్దరినీ ఆనందంలో ముంచెత్తుతోంది. నిన్న చాలా కేంద్రాల్లో మొదటి రోజు కన్నా ఎక్కువ గ్రాస్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. నైజామ్ నుంచి సీడెడ్ దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బయ్యర్ల సమాచారం మేరకు ఇప్పటిదాకా హనుమాన్ వసూలు చేసిన మొత్తం రెండు వందల ఒక్క కోటికి పైనే ఉంది. షేర్ సుమారుగా నూటా ఎనిమిది కోట్లకు అతి దగ్గరలో ఉన్నట్టు చెబుతున్నారు.
ఓవర్సీస్ లో ఏకంగా అల వైకుంఠపురములో, రంగస్థలంని దాటేసి అయిదు మిలియన్ల క్లబ్బులోకి పరుగులు పెడుతున్న హనుమాన్ నెక్స్ట్ టార్గెట్ సలార్ ని పెట్టుకున్నాడు. ఇది కూడా అసాధ్యం అనిపించడం లేదు. గుంటూరు కారం బాగా నెమ్మదించి పోవడంతో పాటు హిట్టు ముద్ర పడిన నా సామిరంగలకు భిన్నంగా హనుమాన్ అదే స్పీడ్ ని కొనసాగించడం విశేషం. కర్ణాటకలో తొమ్మిదిన్నర కోట్లు, హిందీ వెర్షన్ తో కలిపి ఇతర భాషల్లో 17 కోట్ల పై చిలుకు, విదేశాల్లో 22 కోట్ల వరకు రాబట్టిన హనుమాన్ ప్రస్తుతం ట్రిపుల్ సెంచరీ మీద కన్నేశాడు. పరిస్థితి చూస్తుంటే అసాధ్యం అనిపించడం లేదు.
ఇంకో రెండు వారాల వరకు హనుమాన్ అంత సులభంగా తగ్గేలా లేదు. ఈ వారం కెప్టెన్ మిల్లర్, అయలాన్ రెండు డబ్బింగ్ సినిమాలే కావడంతో పాటు ఫిబ్రవరి 2న అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, బూట్ కట్ బాలరాజు లాంటి బడ్జెట్ చిత్రాలు తప్ప పెద్దగా క్రేజ్ ఉన్నవి రావడం లేదు. 9న రవితేజ ఈగల్, ఊరిపేరు భైరవకోన, యాత్ర 2 వచ్చే దాకా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. రేపటి నుంచి కొంత నెమ్మదించే అవకాశం ఉన్నప్పటికీ జనవరి 26 రిపబ్లిక్ డే రూపంలో మరో భారీ వీకెండ్ స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతోంది. చూస్తుంటే హనుమాన్ సంచలనాలు ఇప్పట్లో ఆగడం కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on January 22, 2024 3:29 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…