Movie News

వర్మ వ్యూహానికి మార్గం ఎక్కడ

వివాదాస్పద అంశాల పట్ల టిడిపి నేత నారా లోకేష్ లేవనెత్తిన చట్టపరమైన అభ్యంతరం వల్ల విడుదల ఆగిపోయిన రాంగోపాల్ వర్మ వ్యూహాన్ని నేషనల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ కు పంపుతూ తెలంగాణ కోర్టు తీర్పు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మూడు వారాల గడువు ఇస్తూ సినిమా చూసి రివ్యూ కమిటీ రికమండేషన్లను అడుగుతూ కేసుని వాయిదా వేసింది. ఎన్నికల లోపే రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్న వర్మ కోరిక నెరవేరే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. రాజకీయ అజెండాతో రూపొందిన వ్యూహంలో ప్రతిపక్ష నాయకులను దారుణంగా చూపించారనే అభియోగం మీద వ్యూహం ఆగింది.

ఎంతలేదన్నా రివ్యూ కమిటీ రిపోర్ట్ వచ్చే లోపు ఫిబ్రవరి చివరి వారం అవుతుంది. ఒకవేళ అందులో సానుకూల వ్యతిరేక అంశాలు ఏమున్నా వాటిని తిరిగి సవరించుకుని కొత్త కాపీని సమర్పించేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. ఈలోగా ఎన్నికలు దగ్గరపడతాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు మళ్ళీ వాయిదా వేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఒకవేళ అదే జరిగితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాకే వ్యూహంకి మోక్షం కలుగుతుంది. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జగన్ కు అనుకూలత కోసమే సినిమా తీసిన రాంగోపాల్ వర్మ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేడు.

సో ఇంకో నెల రోజులు ఆగితే కానీ ఈ సస్పెన్స్ తీరేలా లేదు. ఇంచుమించు ఇదే కథతో రూపొందుతున్న యాత్ర 2 మీద ఈ తరహా అభ్యంతరాలు రావడం లేదు. దర్శకుడు మహి వి రాఘవ్ ఒకటి రెండు పాత్రలు తప్ప కాంట్రావర్సికి తావిచ్చే ఎలాంటి అంశాలు జోడించలేదని ట్రైలర్ లోనే చూపించారు. జగన్ కి ఎమోషనల్ ఎలివేషన్లు ఇచ్చేలా కథ రాసుకుని దానికి అనుగుణంగానే ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఇప్పటికైతే యాత్ర 2 గురించి ఎలాంటి అబ్జెక్షన్లు రాలేదు. వర్మ వ్యూహం సంగతి ఇలా ఉంటే దీని సీక్వెల్ శపథంకి ఇదే సమస్య రావొచ్చు. ఇలా అయితే నెలల తరబడి ఎదురు చూడాల్సిందే.

This post was last modified on January 22, 2024 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

3 hours ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

3 hours ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

4 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

4 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

4 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

4 hours ago