అయిదు వందల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరవేస్తూ అయోధ్యలో జరుగుతున్న రామాలయ ప్రారంభోత్సవ వేడుకని ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కోట్లమంది వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రఘురాముడితో తెలుగు సినిమాకున్న అనుబంధం ఏంటో చూద్దాం. ముందు వరసలో చెప్పుకోవాల్సిన చిత్రం స్వర్గీయ ఎన్టీఆర్ ‘లవకుశ’ (1963). అణాపైసలు చెల్లుబాటు కాలంలోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమాగా సి పుల్లయ్య సృష్టించిన చరిత్ర సువర్ణాక్షరాలతో ఉంది. బాపు కమనీయ దృశ్య కావ్యం ‘సంపూర్ణ రామాయణం’ (1972) లో రఘురాముడిగా శోభన్ బాబు దివ్యమంగళరూపానికి ప్రేక్షకులు పునీతులయ్యారు.
బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ (2011)తో ఇప్పటి తరానికి రామాయణ గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేసిన బాపు-రమణలు మర్చిపోలేని ఆణిముత్యాన్ని అందజేశారు. జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా పరిచయమైన ‘రామాయణం’ (1996) ద్వారా గుణశేఖర్ చేసిన సాహసం మళ్ళీ ఎవరూ పునఃసృష్టి చేయలేకపోయారు. భక్తుడి మీద తీసిన సినిమానే అయినప్పటికీ నాగార్జున ‘శ్రీరామదాసు’ (2006) లో రాఘవేంద్రరావు సుమన్ ని చూపించిన తీరు ఆడియన్స్ ని కదిలించింది. ‘ఆదిపురుష్’ (2023) హిందీ సినిమానే అయినప్పటికీ రాముడిగా తెలుగువాడు ప్రభాస్ పోషించడం మనకు గర్వకారణమే.
ఈ అపురూప గాథ ఆధారంగా రూపొందిన క్లాసిక్స్ లో సీతా కళ్యాణం, సీతారామ కళ్యాణం, భూకైలాస్, ఎన్టీఆర్ సంపూర్ణ రామాయణం, దక్ష యజ్ఞం మొదలైనవి కొన్ని మాత్రమే. ఇక రాముడిగా తెరమీద కాసేపైనా కనిపించాలని ఉవ్విళ్ళూరని స్టార్లు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ అందరికీ సాధ్యం కాకపోవడం విధి సంకల్పం. నిజ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిన రాముడనే ఆధ్యాత్మిక భావన సినిమాల్లో కూడా బలంగా పెనవేసుకుపోయింది. ఇక పాటల గురించి చెప్పుకుంటూ పోతే వందల వేలు లెక్క వెళ్తూనే ఉంటుంది. త్వరలో ప్యాన్ ఇండియా స్థాయిలో నితీష్ తివారి రామాయణం తీయబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 22, 2024 10:13 am
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…