స్టార్ క్యాస్టింగ్ లేకుండా అప్ కమింగ్ హీరోతో దర్శకుడు అనుదీప్ తీసిన జాతిరత్నాలు ఎంత సంచలన విజయం సాధించిందో గుర్తే. కేవలం పదకొండు కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేస్తే ముప్పై కోట్లకు పైగా షేర్ రాబట్టడం సెన్సేషన్. అందుకే తమిళ హీరో శివ కార్తికేయన్ పిలిచి మరీ ప్రిన్స్ ఇచ్చాడు. అది ఆశించిన విజయం సాధించలేదు. ఒకవేళ తాను కాకుండా ఎవరైనా ఇమేజ్ లేని వాళ్ళు చేసుంటే పెద్ద విజయం సాధించేదని అయలాన్ ప్రమోషన్లలో హీరోనే చెప్పడం చూస్తే కంటెంట్ ఫెయిల్ కాలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. అనుదీప్ ఇప్పుడు మాస్ రూటు పట్టబోతున్నాడు.
మాస్ మహారాజా రవితేజతో ఒక కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు వచ్చిన వార్త గట్టిగానే చక్కర్లు కొడుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో జనవరి 26 హీరో పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఇన్ సైడ్ టాక్. సప్తసాగరాలు దాటి సైడ్ ఏబి తెలుగులో పెద్దగా ఆడకపోయినా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ రుక్మిణి వసంత్ ని ఇందులో హీరోయిన్ గా లాక్ చేశారనే ప్రచారం ఊపందుకుంది. దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనట. కొన్ని నెలల క్రితమే ఆమెకు అడ్వాన్స్ ఇచ్చిన సితార ఫైనల్ గా ఈ ప్రాజెక్టుకి ఓకే చేయించుకుందని తెలిసింది.
అనుదీప్ కి ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆ మధ్య వెంకటేష్ తో సినిమా చేయి దాకా వచ్చి చేజారింది. అనౌన్స్ మెంట్ రాలేదు కానీ అంతర్గతంగా చర్చలు జరిగిన మాట వాస్తవం. స్క్రిప్ట్ విషయంలో మెప్పించలేకపోవడంతో అది పెండింగ్ లో పడిందట. జాతిరత్నాలు 2 తీసే ఆలోచన జరిగింది కానీ నవీన్ పోలిశెట్టి అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్ల అదీ ప్రాధమిక దశలోనే ఆగింది. ఇన్ని సవాళ్లు దాటుకుని వచ్చిన అనుదీప్ సరైన రీతీలో రవితేజ కామెడీ టైమింగ్ ప్లస్ మాస్ ని వాడుకుంటే స్టార్ లీగ్ లోకి దూసుకుపోవచ్చు. మాస్ ప్రయత్నంలో విజయం దక్కడమంటే సులభం కాదు.
This post was last modified on January 21, 2024 10:05 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…