గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా అవి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్. సినిమా చూసిన వాళ్ళందరూ యావరేజ్ అని అన్నారు కానీ.. ఆ చిత్రానికి అన్నీ కలిసి వచ్చి ఎవరు ఊహించని విజయం సాధించింది. తమిళనాట దాదాపుగా అన్ని కలెక్షన్ల రికార్డులను జైలర్ బద్దలు కొట్టేసింది. ఈ రోజుల్లో ఏ సినిమా పెద్ద హిట్ అయినా దానికి సీక్వెల్ ఆశిస్తున్నారు అభిమానులు. జైలర్ విషయంలో రజినీ అభిమానులు కూడా అందుకు మినహాయింపు కాదు. వారి కోరికను తీర్చేయబోతున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
జైలర్-2కు సంబంధించి ఇప్పటికే అతను స్క్రిప్ట్ దాదాపుగా రెడీ చేసేశాడట. జైలర్ తర్వాత ఏ సినిమా కమిట్ కాని నెల్సన్.. దీని సీక్వెల్ మీదే దృష్టి పెట్టినట్టు సమాచారం. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది. రజనీ కూడా సీక్వెల్ చేయడానికి రెడీనే కానీ.. కాకపోతే ఆయన అందుబాటులోకి రావడానికి చాలా టైం పడుతుంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లాల్ సలాం చిత్రాన్ని పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం వేటగన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ చిత్రంలో నటించాల్సి ఉంది. అది అయ్యాక జైలర్-2ను మొదలుపెట్టొచ్చు. మరి నెల్సన్ అంతవరకు ఆగుతాడా.. లేక ఈలోపు వేరే సినిమా ఏమైనా చేస్తాడా అన్నది చూడాలి.
ఏదేమైనప్పటికీ నెల్సన్- రజిని కాంబినేషన్లో జైలర్-2 రావడం మాత్రం పక్కా. మరికొన్ని రోజుల్లోనే సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. జైలర్ లో ఎలివేషన్లతో మోత మోగించిన నెల్సన్.. రెండో భాగంలో ఇంకెన్ని మెరుపులు చూపిస్తాడో మరి.
This post was last modified on January 21, 2024 3:19 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…