వరుసగా మూడు డిజాస్టర్ల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో హీరో ఆ హీరో అభిమానులు అమితానందంతో ఉన్నారు. సలార్-2 ఇంకా భారీగా ఉంటుందన్న సంకేతాలు రావడంతో దానికోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
సలార్ సీక్వెల్లో విశేషాల గురించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి.. అక్కినేని అఖిల్ క్యామియో రోల్ చేస్తున్నాడు అన్నది. ఇటీవల జరిగిన సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ పాల్గొనడంతో ఈ రూమర్ మొదలైంది. అయితే ఆలస్యం చేయకుండా సలార్ టీం నుంచి ఈ విషయంలో స్పష్టత వచ్చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లిఖిత.. సలార్ సీక్వెల్లో అఖిల్ క్యామియో గురించి క్లారిటీ ఇచ్చింది.
ఇన్స్టాలో నెటిజెన్లతో చిట్ చాట్ సందర్భంగా సలార్ సీక్వెల్లో అఖిల్ నటిస్తున్నాడు అన్న విషయం ఒట్టి వదంతి మాత్రమే అని లిఖిత స్పష్టం చేసింది. సలార్ మూడో భాగం ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానంగా అది సలార్-2 చివర్లోనే తెలుస్తుంది అని వెల్లడించింది. సలార్ టీజర్లో వినిపించిన డైనోసార్ డైలాగ్ సినిమాలో లేకపోవడం గురించి ఆమె మాట్లాడుతూ.. రెండో భాగంలో అది చూడొచ్చు అని చెప్పింది.
సలార్ సీక్వెల్ కి సంబంధించి ఇప్పటిదాకా డైనోసార్ డైలాగ్ వచ్చే సన్నివేశమే చిత్రీకరించినట్లు ఆమె తెలిపింది. దేవా- వరద మధ్య ఫైట్ ఉంటుందా.. దేవాకి ఇంకో తమ్ముడు ఉన్నాడా.. శ్రేయ రెడ్డి- శృతిహాసన్ మధ్య శత్రుత్వం ఏంటి.. ఇలాంటి ప్రశ్నలు వేటికి లిఖిత సూటిగా సమాధానం చెప్పలేదు. అవన్నీ పార్ట్ -2లోనే చూసి తెలుసుకోవాలని చెప్పింది.
This post was last modified on January 21, 2024 3:18 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…