Movie News

చరణ్ పాత్రకు సమంత ఎక్స్‌టెన్షన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత పోషించినన్ని విలక్షణ పాత్రలు మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. స్టార్ స్టేటస్ సంపాదించాక కొన్ని గ్లామర్ క్యారెక్టర్లు చేసినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఆమె ఒప్పుకోవట్లేదు. పెద్ద పెద్ద సినిమాల్లో కూడా విలక్షణ పాత్రలే చేసింది.

‘రంగస్థలం’లోనూ ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండి తన ప్రత్యేకతను చాటిచెప్పింది. పెళ్లి తర్వాత ఇలా విభిన్నమైన పాత్రలతోనే సాగిపోతోంది సామ్. చివరగా ఆమె ‘ఓ బేబీ’ సినిమాతో మురిపించింది. ఆ క్యారెక్టర్ సామ్ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. కొన్ని నెలల కిందటే డిజిటల్ మీడియంలోకి కూడా సామ్ అడుగు పెట్టింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్లో సామ్ టెర్రరిస్టు పాత్ర చేసినట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఇది విడుదల కాబోతోంది.

ఇదిలా ఉండగా తమిళంలో సామ్ కొత్తగా ఓ సినిమా అంగీకరించింది. విజయ్ సేతుపతి అందులో హీరో. ‘మయూరి’, ‘గేమ్ ఓవర్’ సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో సమంత ఓ షాకింగ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె బదిరురాలిగా కనిపించనుందట. తను ఏమీ మాట్లాడలేదు. తనకు ఏదీ వినిపించదు. ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి పాత్రలో నటించడం అరుదైన విషయం.

బదిరురాలి పాత్ర అనగానే సమంత నటించిన ‘రంగస్థలం’ గుర్తుకు రాకమానదు. అందులో చరణ్ చెవిటివాడి పాత్రలో కనిపించాడు. ఈ వైకల్యాన్ని వినోదాత్మకంగా చూపించి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సుకుమార్. స్టార్లు కూడా ఇలాంటి వైకల్యం ఉన్న పాత్రలు చేయొచ్చన్న ధైర్యాన్నిచ్చిన సినిమా అది. ఇప్పుడు సామ్ చిట్టిబాబు పాత్రకు ఎక్స్‌టెన్షన్ అనదగ్గ పాత్ర చేయబోతోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నారు. తెలుగులో మాత్రం సమంత కొత్తగా ఏ చిత్రాన్ని అంగీకరించినట్లు కనిపించడం లేదు.

This post was last modified on September 5, 2020 12:11 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

7 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

1 hour ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

2 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago