సీనియర్ హీరోలతో కలిసి నటించడం వల్ల ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్చుకునే అదృష్టం దక్కుతుంది. అవి ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ రూపంలో వివరించారు చిరంజీవి. ఇవాళ విశాఖపట్నంలో లోకాయుక్త ఫౌండేషన్ ఆధర్వంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి, అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. చిరు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంతో తిరుగులేని మనిషిలో అన్నగారితో కలిసే అదృష్టం దక్కింది. అందులో ఆయన కాంబినేషన్లో చెప్పుకోదగ్గ సీన్లతో పాటు ఒక ఫైట్ కూడా ఉంటుంది.
దాని షూటింగ్ జరుగుతుండగా ఒక సన్నివేశంలో మూడు అడుగుల ఎత్తు నుంచి ఇద్దరూ దూకాల్సి వచ్చింది. యాక్షన్ అనగానే చిరంజీవి వెంటనే దూకేయగా ఎన్టీఆర్ అక్కడే ఉండిపోయారు. వెంటనే బ్రదర్ ఎందుకలా చేశారని పెద్దాయన నిలదీయడంతో నాకెవరూ చెప్పలేదని అందుకే ఆలా చేశానని వివరణ ఇచ్చారు. చిరు నటుల జీవితాలు చాలా విలువైనవి, ఇలా తొందరరపడి ఏదైనా జరగకూడనిది జరిగితే దాని వల్ల నిర్మాత నష్టపోతాడు కాబట్టి ఆ రిస్కుని అనుభవజ్ఞులైన డూపులకు ఇవ్వాలని చెప్పారు. విన్నంత సేపూ తలూపిన చిరంజీవి కుర్రతనం వల్ల సలహాని మరీ సీరియస్ గా తీసుకోలేదు.
సరిగ్గా ఏడాది తర్వాత సంఘర్షణ షూటింగ్ లో సరిగ్గా మళ్ళీ మూడు అడుగుల ఎత్తు నుంచి దూకబోయి కాలు మడత పడటంతో చిరంజీవి ఏకంగా ఆరు నెలలు విశ్రాంతి తీసుకుని చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే అన్న ఎన్టీఆర్ చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది. తన దూకుడు వల్ల ప్రొడ్యూసర్ కి చాల నష్టం వచ్చిందని, కొంచెం ఆలోచించి ఉంటే ఆ సమస్య వచ్చేది కాదని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. ఏదైనా కొన్ని అనుభవం వల్లే నేర్చుకుంటామని చెప్పడానికి ఇదో మంచి ఉదంతం. పెద్దల మాట చద్ది మూటని ఊరికే సామెతలు పుట్టుకురాలేదు.
This post was last modified on January 20, 2024 4:40 pm
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…