Movie News

చిరంజీవి ఆత్మకథకు రచయిత దొరికారు

టాలీవుడ్ సెలబ్రిటీలు ఆత్మకథలు రాసుకోవడం సహజం. అందరూ కాదు కానీ ఎందరో ప్రముఖులు వాళ్లే స్వయంగా లిఖించుకోవడమో లేదా వేరే వాళ్ళతో రాయించుకోవడమో చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, గొల్లపూడి, రామానాయుడు, దాసరి నారాయణరావు, ఎస్విఆర్, విట్టలాచార్య, అల్లు రామలింగయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చేరబోతున్నారు. పనుల ఒత్తిడితో తానే రాసుకోలేని పరిస్థితిలో ఈ బృహత్కర బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పజెబుతున్నట్టు ప్రకటించారు.

ఇవాళ వైజాగ్ లో మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఆధ్వర్యంలో లోకాయుక్త ఫౌండేషన్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన సందర్భంగా చిరంజీవి తన పుస్తకం గురించి చెప్పారు. గతంలో చిరు మీద కొన్ని బుక్స్ వచ్చాయి. రెండేళ్ల క్రితం ప్రముఖ జర్నలిస్టు వినాయకరావు ది లెజెండ్ పేరుతో వెలువరించారు కానీ అది కేవలం నూటా యాభై సినిమాల విశేషాలతో కూడుకుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు యండమూరి రాసే బయోగ్రఫీలో బాల్యం నుంచి ఇప్పటిదాకా అన్ని ఘట్టాలు ఉంటాయి.

ఎంత టైం పడుతుంది, ఎప్పుడనేది చెప్పలేదు కానీ ఫాన్స్ ఒకపక్క సంతోషం వ్యక్తం చేస్తూనే గతంలో రామ్ చరణ్ మీద యండమూరి చేసిన కొన్ని కామెంట్స్ ని గుర్తు చేస్తూ పూర్తి సంతృప్తిని వెలిబుచ్చలేకపోతున్నారు. ఈయనకు చిరంజీవితో అనుబంధం అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, దొంగమొగుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఉంది. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ కు ఏకంగా డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చారు. కానీ అది అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. ఆత్మకథ రాయడమంటే సమయం పట్టే వ్యవహారం కాబట్టి ఎదురు చూసే టైం ఎక్కువే ఉంటుంది.

This post was last modified on January 20, 2024 4:29 pm

Share

Recent Posts

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

5 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

4 hours ago