అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని.. మూడేళ్లు తిరిగేసరికి అతని నుంచి విడిపోయింది సమంత. నాలుగో ఏట వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేశాయి. విడాకుల విషయంలో చైతు ఎప్పుడు పొడిగా పొడిపొడిగానే మాట్లాడుతున్నాడు. అది ఇద్దరికీ మంచి చేసే నిర్ణయమే అన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ సమంత మాత్రం తన పెళ్లి విడాకులు విషయంలో ఎప్పుడు కొంచెం కటువుగానే ఆవేదనభరితంగానే మాట్లాడుతూ వస్తోంది. నాగచైతన్యను ఉద్దేశించి పరోక్షంగా ఇప్పటికే కొన్ని కౌంటర్లు వేసింది సమంత. ఇప్పుడు మరోసారి తన మాజీ భర్త గురించి నెగిటివ్ కామెంట్ చేసింది.
ఒక సోషల్ మీడియా చిట్ చాట్లో భాగంగా.. మీరు జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏంటి అని ఒక అభిమాని సమంతను అడిగాడు. అందుకు ఆమె బదులిస్తూ.. తన ఇష్టాఇష్టాలేంటో తానే తెలుసుకోలేకపోవడమే పెద్ద వైఫల్యం అని చెప్పింది. కానీ ఇంతకు ముందు ఉన్న బంధంలో తన భాగస్వామి తన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేసినట్లు ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
పరోక్షంగా చైతు వల్ల తన ఇష్టాయిష్టాలను మార్చుకోవాల్సి వచ్చిందని సమంత చెప్పకనే చెప్పింది. అత్యంత క్లిష్ట సమయాల్లోనూ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఒకటి ఉంటుందని తెలుసుకున్న క్షణమే తన వ్యక్తిగత ఎదుగుదల మొదలైందని సమంత వ్యాఖ్యానించింది. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ అతి త్వరలోనే విడుదల కాబోతుంది. కొత్తగా ఆమె ఏ సినిమాలు ఒప్పుకున్న సంకేతాలు కనిపించడం లేదు.
This post was last modified on January 19, 2024 5:25 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…