సంక్రాంతి హడావిడిలో వదిలేశాం కానీ గత నెల డిసెంబర్ 22న విడుదలైన సలార్ కొన్ని చోట్ల పరిమిత షోలతో థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఇంకా నెల రోజులు కాకపోవడంతో ఎగ్జిబిటర్లు కొనసాగిస్తున్నారు. ఎలాగూ ఓటిటి లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఫ్యాన్స్ రిపీట్ షోలకు టికెట్లు కొంటూనే ఉన్నారు. కట్ చేస్తే హఠాత్తుగా సలార్ డిజిటల్ డేట్ లాకైపోయింది. అది కూడా జనవరి 20 అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు అధికారికంగా యాప్ లో ఉన్న కమింగ్ సూన్ (అతి త్వరలో) సెక్షన్ లో ప్రకటించడంతో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు.
హోంబాలే ఫిలిమ్స్ కేవలం 28 రోజులు అంటే నాలుగు వారాల విండోతో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఇంత త్వరగా స్మార్ట్ స్క్రీన్ మీద చూసే అవకాశం దక్కుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో చూడొచ్చు. హిందీ మాత్రం ఆలస్యమవుతుంది. నార్త్ మల్టీప్లెక్సులతో బాలీవుడ్ చేసుకున్న ఒప్పందం కారణంగా ఎనిమిది వారాల కన్నా ముందు పెద్ద సినిమాలు ఓటిటిలో రావడానికి వీల్లేదు. అందుకే ప్రస్తుతానికి ప్రాంతీయ భాషలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇటీవలే సక్సెస్ పార్టీ చేసుకున్న సలార్ బృందం మొన్నటి నుంచి కొత్త ప్రమోషనల్ ఇంటర్వ్యూలు పెడుతోంది.
అభిమానులకు ఇది సంతోషపెట్టే వార్తే అయినా మరీ ఇంత తక్కువ గ్యాప్ లో ఇలాంటి భారీ ప్యాన్ ఇండియా మూవీని స్ట్రీమింగ్ కి ఇచ్చేయడం పట్ల బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కు వంద రూపాయల చొప్పున పెంపుకు అనుమతులు తీసుకుని దానికి అనుగుణంగా బిజినెస్ చేసుకున్న తర్వాత ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుందని టెన్షన్ పడుతున్నారు. నెట్ ఫ్లిక్స్ మాత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇప్పటిదాకా ఉన్న ఇండియన్ మూవీస్ రికార్డులను బద్దలు కొట్టే స్థాయిలో వ్యూస్ తెస్తుందని నమ్మకంతో ఉన్నారు. పెద్ద మొత్తానికి కొన్నది అందుకే.
This post was last modified on January 19, 2024 10:00 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…